Asianet News TeluguAsianet News Telugu

సంచయిత క్రిస్టియన్ అంటూ సంచలన ట్వీట్ చేసిన టాలీవుడ్ ప్రొడ్యూసర్

సంచయిత గజపతి రాజు హిందువా కదా అనే ఒక చర్చ మొదలయింది. సంచయిత క్రిస్టియన్ అంటూ అందరూ చెబుతున్నారు. దానికి బలాన్ని చేకూరుస్తూ 2017లో వాటికన్ సిటీని సందర్శించినప్పుడు అక్కడ ఆమె తీసుకున్న ఒక చిత్రం ఇప్పుడు వైరల్ గా మారింది. ఆమె తన ట్విట్టర్ అకౌంట్ నుండి అప్పట్లో ఆ ఫోటోను ట్వీట్ చేయడం విశేషం. 

Mansas trust issue: Is sanchaita Gajapati a christian? photos viral
Author
Simhachalam, First Published Mar 7, 2020, 2:03 PM IST

సింహాచలం అప్పన్న సాక్షిగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ దుమారం కొనసాగుతున్న విషయం తెలిసిందే! అశోక్ గజపతి రాజును కాదని సంచయిత గజపతి రాజుకు మన్సాస్ ట్రస్ట్ బాధ్యతలను అప్పగించారు.

ఇక ఈ విషయం పై స్పందించిన అశోక్ గజపతి రాజు, ట్రస్టు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం సరికాదని ఈ మాజీ ఎంపీ అన్నారు. మాన్సాస్ ట్రస్టు వివాదం పై గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో అశోక్ గజపతి రాజు స్పందించారు.

మాన్సాస్ ట్రస్ట్  ఛైర్మన్ నియామకంలో ప్రభుత్వ తీరుపై అశోక గజపతిరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ... వేరే మతం వారిని ఎలా నియమిస్తారని అన్నారు. 

ప్రభుత్వ వైఖరి వింతగా ఉందని ఆయన అన్నారు. ఇప్పటి వరకు జీవోనీ కనీసం బయట పెట్టలేదని ఆయన అన్నారు.వేరే మతం వారిని నియమిస్తే సమస్యలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ట్రస్టు,దేవాలయ భూములపై కన్నేశారని మండిపడ్డారు. దాతల భూములు ఆలయాలకే చెందాలన్నారు.

ఇక దానితో సంచయిత గజపతి రాజు హిందువా కదా అనే ఒక చర్చ మొదలయింది. సంచయిత క్రిస్టియన్ అంటూ అందరూ చెబుతున్నారు. దానికి బలాన్ని చేకూరుస్తూ 2017లో వాటికన్ సిటీని సందర్శించినప్పుడు అక్కడ ఆమె తీసుకున్న ఒక చిత్రం ఇప్పుడు వైరల్ గా మారింది.

సంచయిత క్రిస్టియన్ అంటూ 2017లో సంచయిత వాటికన్ సందర్శించినప్పుడు ట్వీట్ చేసిన ఒక ఇమేజ్ ను టాలీవుడ్ ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ ఈ రోజు సోషల్ మీడియాలో ఉంచారు. హిందూ దేవాలయాల్లో ఏం జరుగుతోందంటూ ఆయన వ్యక్తం చేసారు. ఎవరికీ చెప్పుకోవాలి అంటూ పవన్ కళ్యాణ్ ని ప్రధాని మోడీని టాగ్ చేసారు. ఆమె తన ట్విట్టర్ అకౌంట్ నుండి అప్పట్లో ఆ ఫోటోను ట్వీట్ చేయడం విశేషం. 

ఇప్పుడు దీనైపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుంది. ఇలా అన్యమతస్థురాలిని సింహాచలం వంటి దేవస్థానానికి ఎలా ట్రస్టు బోర్డు చైర్మన్ ని చేస్తారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ధర్మాన్ని కాపాడాలని వారు కోరుకుంటున్నారు. 

ఆలయాల వ్యవహారాల్లో రాజకీయాలు చేయొద్దని సూచించారు. మాన్సాస్‌ చైర్మన్‌ పదవి మార్పు వింతగా ఉందన్నారు. భక్తుల నమ్మకాలపై దెబ్బకొట్టారని ధ్వజమెత్తారు. వంశపారంపర్య పదవుల్లో, ట్రస్టుల్లో అన్యమతస్తుల జోక్యం సరికాదని పేర్కొన్నారు. మాన్సాస్‌ ట్రస్ట్‌లో దేవాదాయ శాఖ అధికారులతోనే... నిర్వీర్యం చేయడానికి కొన్నాళ్లుగా ఎత్తుగడలు వేశారని ఆరోపించారు. 

రాష్ట్రంలో ఎన్ని పార్టీలు మారినా... ఇలాంటి సమస్యలు రాలేదని వాపోయారు. రాజకీయాలతో సంబంధంలేని సంస్థకు రాజకీయాలు ఆపాదించడం దేశానికి అరిష్టమని తెలిపారు. తనకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే పదవి నుంచి తొలగించారన్నారు. జీవో కాపీ అందిన తర్వాత కోర్టును ఆశ్రయించాలా?... ఏ విధమైన పోరాటం చేయాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ వైఖరి వల్ల పరిశ్రమలు, పెట్టుబడిదారులు వెళ్లిపోతున్నారని అశోక్‌ గజపతిరాజు వ్యాఖ్యానించారు. 

కాగా...  ఇటీవల మాన్సాస్ ట్రస్టు విషయంలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌గా, మహారాజా అలక్‌ నారాయణ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌(మాన్సాస్‌) ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా ఆనందగజపతి కుమార్తె సంచయిత గజపతిరాజును నియమించింది. దీంతో ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీ టీడీపీ... ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టింది.

1958 సంవత్సరంలో దివంగత పివిజి రాజు మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్ప్ అండ్ సైన్సెస్ (మాన్సాస్)ను నెలకొల్పారు. విద్యా వ్యవస్థను అభివృద్ధి పరిచేందుకు మాన్సాస్ విద్యా సంస్థలను నడుపుతోంది. 1958సంవత్సరంలో పివిజి రాజు వ్యవస్థాపక చైర్మన్‌ కాగా ఆనంద గజపతిరాజు, అశోక్‌ గజపతిరాజు ట్రస్ట్‌ బోర్డు సభ్యులుగా ఉండేవారు. 

1994 సంవత్సరంలో పివిజి రాజు మరణం చెందిన తర్వాత ఆనంద గజపతిరాజు చైర్మన్‌ అయ్యారు. 2016లో ఆయన మరణం తర్వాత అశోక్‌ గజపతిరాజు చైర్మన్‌ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆనంద గజపతి రాజు కుమార్తె సంచయిత గజపతిరాజుకు మాన్సస్ ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో తాజాగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ ఆయన మాట్లాడారు. 

Follow Us:
Download App:
  • android
  • ios