అసంతృప్తి, పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోవడం లాంటి కారణాలతో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు.
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ లో మంగళగిరి ఎమ్మెల్యే రాజీనామా కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈ సీటును వేరేవారికి కేటాయిస్తారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా వైఎస్సార్పీపీలో తనకు ప్రాధాన్యత తగ్గిపోతుందన్న అసంతృప్తిలో ఉన్నారు. దీంతో సోమవారం ఉదయం స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా సమర్పించారు. సాయంత్రం లోపు ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు సమాచారం.
వైసీపీ ఇంచార్జ్ గా గంజి చిరంజీవిని నియమిస్తుండడంతో రాజీనామా చేసినట్లు సమాచారం. ఆదివారం ప్రత్యేకంగా గంజి చిరంజీవి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎన్నికల ముందు ఇలా రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. అమరావతి చుట్టు పక్కల ప్రాంతాలు ఎన్నికల సమయంలో కీలకంగ మారనున్నాయి. ఆళ్ల ఎఫెక్ట్ దీనిమీద పడుతుందా అని అనుకుంటున్నారు. ఆయన రాజీనామాకు అనధికారికంగా వైఎస్ షర్మిల వర్గం అనే ప్రచారం కూడా దీనికి కారణం అని తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
