Asianet News TeluguAsianet News Telugu

గాయపడిన నాగుపాముకి చికిత్స..!

ఆ సమాచారం భాస్కర్ అనే ఓ యువకుడికి తెలిసింది. అతను ఓ జంతు ప్రేమికుడు కావడం గమనార్హం. దీంతో.. వెంటనే ఆ పాముని అక్కడి నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చాడు.

Man Treated Snake In Paderu
Author
Hyderabad, First Published Dec 14, 2020, 7:42 AM IST

కళ్లముందు పాము వెళితే మనమంతా ఏం చేస్తాం.. భయంతో వెంటనే అక్కడి నుంచి వెంటనే పరుగులు తీస్తారు. ఇంకొందరేమో.. కర్రలు పట్టుకొని వచ్చి కొట్టి మరీ చంపేస్తారు. అయితే..   ఓ యువకుడు మాత్రం పాము  ప్రాణాలు కాపాడాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకోగా..  పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

విశాఖపట్నం జిల్లా పాడేరు వెంకటగిరి వీధిలో ఓ ఇంటి నిర్మాణం జరుగుతుండగా అక్కడ ఓ నాగుపాము కనిపించింది.  కాగా... ఆ నాగుపాము తీవ్రంగా గాయపడి కనిపించింది. ఆ సమాచారం భాస్కర్ అనే ఓ యువకుడికి తెలిసింది. అతను ఓ జంతు ప్రేమికుడు కావడం గమనార్హం. దీంతో.. వెంటనే ఆ పాముని అక్కడి నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చాడు.

అనంతరం దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకువెళ్లి.. దానికి చికిత్స చేయించాడు. దెబ్బ తగిలిన చోట కట్టు కట్టించాడు. అనంతరం ఆ పాముని మినుములూరు కొండల్లో సురక్షితంగా విడిచిపెట్టాడు. కాగా.. అతను చేసిన పనికి స్థానికులు ఫిదా అయ్యారు. వెంటనే అతనిని ప్రశంసించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios