అక్రమ సంబంధం ఓ తాపీ మేస్త్రీ ఉసురు తీసింది. శనివారం రాత్రి పెనుగంచిప్రోలు లోని నవాబు పేటలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖర్, ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. నవాబుపేట గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ గుంజి సత్యనారాయణ అదే గ్రామనికి చెందిన ఓ వివాహితతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. 

సదరు మహిళ ఐదేళ్ల క్రితమే భర్తతో విడిపోయింది. ఆమెకు ఏడేళ్ల కూతురు ఉంది. శనివారం రాత్రి సత్యనారాయణ ఆమె ఇంటికి వెళ్లాడు. తెల్లారినా తండ్రి తిరిగి ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన సత్యనారాయణ ఆమె ఇంటికి వెళ్లి పరిశీలించాడు.

అక్కడ తండ్రి శవమై కనిపించడంతో వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ, ఎస్సైలు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడి తల వెనుక బలమైన గాయం అయినట్టు పోలీసులు గుర్తించారు.

అయితే అప్పటికే వివాహిత తన కూతురితో సహా పరారయ్యింది. మృతుని కుమారుడి ఫిర్యాదు మేరకు వివామితమీద హత్య కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.