కడప జిల్లా రైల్వే కోడూరులో దారుణం జరిగింది. అబ్ధుల్ ఖాదర్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఖాదర్‌కు ఈ నెల 23న బంధువులు పెళ్లి నిశ్చయించారు.

ఈ క్రమంలో పెళ్లి పనులతో పాటు వ్యక్తిగత పని మీద స్వగ్రామానికి వస్తున్న ఖాదర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు మాటు వేసి దారుణంగా హతమార్చారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.