Asianet News TeluguAsianet News Telugu

హత్య చేశారు.. మృతదేహాన్ని ట్రాక్టర్ తో తొక్కించి ఏమార్చే ప్రయత్నం....

ప్రకాశం జిల్లా ముటుకుల పంచాయతీలో ఉపాధి జూనియర్ మేట్ గాడికొయ్య పిచ్చయ్య (35) దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు అతన్ని హత్య చేసి dead bodyని ట్రాక్టర్ తో తొక్కించారు.

man murder and create a road accident in prakasam
Author
Hyderabad, First Published Nov 8, 2021, 10:02 AM IST

పుల్లల చెరువు : ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని అమానుషంగా హత్య చేసి.. యాక్సిడెంట్ గా చిత్రీకరించడానికి అమానుషానికి తెగబడ్డారు. చంపేసి.. మృతదేహాన్ని ట్రాక్టర్ తో తొక్కించారు. అయితే ఈ ఘటన మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రకాశం జిల్లా ముటుకుల పంచాయతీలో ఉపాధి జూనియర్ మేట్ గాడికొయ్య పిచ్చయ్య (35) దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు అతన్ని హత్య చేసి dead bodyని ట్రాక్టర్ తో తొక్కించారు.

ఈ సంఘటన ఆదివారం వెలుగు చూసింది. ప్రాథమిక సమాచారం మేరకు పిచ్చయ్య శనివారం పుల్లల చెరువులోని Job guarantee కార్యాలయానికి వచ్చి, రాత్రి తిరిగి ఇంటికి బయలుదేరాడు. ముటుకుల గ్రామ సమీపంలో దుండగులు అతన్ని అటకాయించి సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి murder చేశారు.

ఆ తరువాత మృతదేహాన్ని రోడ్డు మీదకు చేర్చి tractor తో తొక్కించారు. అతని 
Motorcycle ను కూడా తొక్కించి Road accidentగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఆదివారం ఉదయం సమాచారం అందుకున్న ఎస్ఐ సుధాకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

పొలాల్లోనూ పరిశీలించి.. రక్తపు మరకలు గుర్తించి, పిచ్చయ్యది హత్యగా నిర్థారించారు. మరోవైపు పిచ్చయ్య బంధువులు, మృతుడి స్నేహితుడైన చౌడబోయిన మల్లికార్జునపై Suspicionతో అతని ఇంటిపై రాళ్లదాడి చేశారు. 

ఇంటి రేకులు తొలగించి ధ్వంసం చేశారు. ఈ చర్యలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ పైనా దాడికి దిగడంతో ఆయన తలకు గాయాలయ్యాయి. ఇద్దరి మధ్య ఇటీవల తీవ్రమైన విభేదాలు తలెత్తి ఘర్షణ పడినట్లు చెప్పుకొంటున్నారు. 

సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న టమాటా.. కొండెక్కిన ధరలు, కేజీ ఎంతో తెలుసా..?

మార్కాపురం డీఎస్పీ కిశోర్ కుమార్ నేతృత్వంలో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మల్లికార్జునను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని సీఐ హాబీ ఇవ్వడంతో వారి బంధువులు శాంతించారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. 

బంగారం కోసం కన్నతల్లినే...
డబ్బు, బంగారం ఇవ్వలేదని కన్న తల్లిని హత్య చేశాడో తనయుడు. ఆమె చెవికి ఉనన రెండు బంగారు చెవిదిద్ధులతో పరారైన చిన్న కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు డీసీపీ-1 గౌతమి వెల్లడించారు.

ఎన్. అచ్చియమ్మ (63)  వెలంపేట దరిలో ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు కొడుకులు. వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు.  2016లో Propertyలో ఆమె వాటా కింద వచ్చిన రూ. 20 లక్షల్లో రూ. 9.50 లక్షలతో ఇంటిని, మిగిలిన మొత్తంతో కొంత gold కొనుగోలు చేసింది.  Pensionతో జీవనం సాగిస్తూ ఉంది. 

చిన్న కుమారుడు నాగ శంకర్రావుతో డబ్బుల విషయంలో తరచూ గొడవలు జరిగేవి. డబ్బులు, బంగారం ఇవ్వాలని అచ్చియమ్మను ఇబ్బంది పెట్టే వాడు. ఈనెల 4న సాయంత్రం ఆరున్నర గంటలకు నాగ శంకరరావు అచ్చియమ్మ వద్దకు వెళ్ళాడు.

బంగారం, డబ్బులు కావాలని పట్టుబట్టాడు. దీనికి అచ్చియమ్మ నిరాకరించడంతో  ఆటో లో ఉన్న  నైలాన్ తాడు తీసుకువచ్చి  ఆమె మెడకు చుట్టి.. murder చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 

ఈ నెల 6న అచ్చియమ్మ బంధువు ఆమె ఇంటికి రాగా, చనిపోయి ఉండటాన్ని గమనించి... వెంటనే పెద్ద కుమారుడు  ఉమా నాగరాజుకు సమాచారం ఇచ్చాడు. అతను చేసిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించారు. చిన్న కుమారుడు  హత్య చేసి ఉంటాడని భావించారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా నిజం ఒప్పుకున్నాడు. అతని నుంచి బంగారు చెవిదిద్దులు స్వాధీనం చేసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios