ఫోన్ లో బొమ్మలు చూపిస్తానని ఆశచూపి ఓ చిన్నారిపై గ్రామ వాలంటీరు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన నెల్లూరు జిల్లా లో చోటుచేసుకుంది. కాగా... ఈ విషయం గ్రామస్థులకు తెలియడంతో... సదరు గ్రామవాలంటీర్ ని చితకబాదారు.

ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే... నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పెదరాజుపాళెంలో గురువారం చోటుచేసుకుందీ ఘటన. పోలీసుల కథనం మేరకు.. బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతూ పెద్దరాజుపాళెంలో వలంటీరుగా పని చేస్తున్న పవన్‌ కల్యాణ్‌(22) తన ఇంటి పక్కనే నివాసం ఉంటున్న 9 ఏళ్ల చిన్నారికి ఫోన్‌లో గేమ్స్‌ చూపిస్తానని నమ్మించి తన ఇంటికి తీసుకెళ్లాడు.

ఆ చిన్నారి ఫోన్‌లో గేమ్స్‌ చూడడంలో నిమగ్నమైన కొంతసేపటి తర్వాత ఆమెపై పవన్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి భయపడి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గమనించి వలంటీరుకు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ గంగాధర్‌రావు తెలిపారు.