దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువస్తున్నా... కిరాతకుల ఆగడాలకు మాత్రం అంతూ పొంతూ లేకుండా పోతోంది. మహిళలపై చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడితే.. వారిని కఠినంగా శిక్షిస్తామంటూ ఏపీ ప్రభుత్వం నిన్ననే దిశ చట్టం శాసనసభలో ఆమోదం పొంది. అది జరిగి ఒక్క రోజు కూడా గడవకముందే.... దారుణం చోటుచేసుకుంది. కన్న తల్లే... తన కడుపున పుట్టిన కూతురిని ఓ ముసలాడి వద్దకు పంపించింది. ఈ దారుణం కృష్ణా జిల్లా కంచికచర్ల లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కంచికచర్లకు చెందిన ఓ మహిళ తన కన్న కూతురిని... మైనర్ అని కూడా చూడకుండా తన ప్రియుడు రాంబాబు(56) వద్దకు పంపింది. కాగా...  ఆ రాంబాబు... బాలికకు రాత్రంతా నరకం చూపించాడు. పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా... బాలిక... అక్కడి నుంచి ఇంటికి వెళ్లి తన నానమ్మకు తెలియజేసింది. కాగా... బాలిక తండ్రి కొన్ని సంవత్సరాల క్రితమే చనిపోయాడు.

మైనర్ బాలిక నానమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బాలిక తల్లి కటారపు మార్తమ్మను పోలీసులు అదుపులోకి తీసుకోగా తంగిరాల రాంబాబు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు ఈ సంఘటనపై  ఫోక్స్  చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.