Asianet News TeluguAsianet News Telugu

చెవి దిద్దుల కోసం కన్నతల్లినే.. కడతేర్చాడు...!

చిన్న కుమారుడు నాగ శంకర్రావుతో డబ్బుల విషయంలో తరచూ గొడవలు జరిగేవి. డబ్బులు, బంగారం ఇవ్వాలని అచ్చియమ్మను ఇబ్బంది పెట్టే వాడు. ఈనెల 4న సాయంత్రం ఆరున్నర గంటలకు నాగ శంకరరావు అచ్చియమ్మ వద్దకు వెళ్ళాడు.

Man 'kills' mother for gold in visakapatnam
Author
Hyderabad, First Published Nov 8, 2021, 8:16 AM IST

విశాఖ :  డబ్బు, బంగారం ఇవ్వలేదని కన్న తల్లిని హత్య చేశాడో తనయుడు. ఆమె చెవికి ఉనన రెండు బంగారు చెవిదిద్ధులతో పరారైన చిన్న కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు డీసీపీ-1 గౌతమి వెల్లడించారు.

ఎన్. అచ్చియమ్మ (63)  వెలంపేట దరిలో ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు కొడుకులు. వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు.  2016లో Propertyలో ఆమె వాటా కింద వచ్చిన రూ. 20 లక్షల్లో రూ. 9.50 లక్షలతో ఇంటిని, మిగిలిన మొత్తంతో కొంత gold కొనుగోలు చేసింది.  Pensionతో జీవనం సాగిస్తూ ఉంది. 

చిన్న కుమారుడు నాగ శంకర్రావుతో డబ్బుల విషయంలో తరచూ గొడవలు జరిగేవి. డబ్బులు, బంగారం ఇవ్వాలని అచ్చియమ్మను ఇబ్బంది పెట్టే వాడు. ఈనెల 4న సాయంత్రం ఆరున్నర గంటలకు నాగ శంకరరావు అచ్చియమ్మ వద్దకు వెళ్ళాడు.

బంగారం, డబ్బులు కావాలని పట్టుబట్టాడు. దీనికి అచ్చియమ్మ నిరాకరించడంతో  ఆటో లో ఉన్న  నైలాన్ తాడు తీసుకువచ్చి  ఆమె మెడకు చుట్టి.. murder చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 

ఈ నెల 6న అచ్చియమ్మ బంధువు ఆమె ఇంటికి రాగా, చనిపోయి ఉండటాన్ని గమనించి... వెంటనే పెద్ద కుమారుడు  ఉమా నాగరాజుకు సమాచారం ఇచ్చాడు. అతను చేసిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించారు. చిన్న కుమారుడు  హత్య చేసి ఉంటాడని భావించారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా నిజం ఒప్పుకున్నాడు. అతని నుంచి బంగారు చెవిదిద్దులు స్వాధీనం చేసుకున్నారు. 

కుప్పం : టీడీపీ అభ్యర్ధి కిడ్నాప్ కాలేదు.. వైసీపీది దుష్ప్రచారం, అచ్చెన్న స్పందన ఇదీ

చేపల మార్కెట్లో ఛోరీ..
ఇదిలా ఉండగా.. విజయవాడలో చోరీ కలకలం రేపింది. Vijayawada బీసెంట్ రోడ్డు చేపల మార్కెట్లో ఓ దొంగ చాకచక్యంగా దొంగతనానికి పాల్పడ్డాడు. Fish Marketలో మొబైల్ ఫోన్లు, పర్సులు చోరీ చేశాడు. ఏడాదిన్నర బాలికను వెంటబెట్టుకుని ఆ దొంగ చేపల మార్కెట్‌కు వచ్చాడు. 

మార్కెట్‌లో పలువురి Mobile Phones, Purseలను దొంగిలించాడు. ఈ వ్యవహారంపై వ్యాపారులు అప్రమత్తమయ్యారు. నిందితుడిని వారే గుర్తించి పట్టుకున్నారు.  ఆ నిందితుడిని వ్యాపారస్తులు పట్టుకున్నారు. కానీ, తర్వాత ఆ ఏడాదిన్నర చిన్నారిని అక్కడే వదిలి పెట్టి పరారయ్యాడు. 

ఇప్పుడు ఆ ఏడాదిన్నర బాలిక వ్యాపారుల ఆశ్రయంలోనే ఉన్నది. ఆ బాలిక నిందితుడి కూతురా? లేక ఆమెనూ కిడ్నాప్ చేసుకుని పట్టుకు వచ్చాడా? అనే కోణంలో అనుమానిస్తున్నారు. ఈ చోరీపై వ్యాపారులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

హైదరాబాద్‌లో ఇటీవలే దొంగతనం జరిగింది  జూబ్లీ హిల్స్‌లోని వస్త్ర వ్యాపారి దీపావళి పూజ నిర్వహిస్తున్న సందర్భంలో ఇంట్లో పనికి వచ్చిన ఓ వ్యక్తి లక్షల రూపాయలన కొట్టేశాడు. చివరికి దొరికిపోతాననే భయంతో వాష్ రూమ్ వెళ్లి బాత్‌రూమ్ కమోడ్‌లో వేసి ఫ్లష్ చేశాడు. పోలీసుల విచారణలో నిందితుడు చేసిన నేరాన్ని అంగీకరించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios