ఆవేశంలో అన్న.. సొంత తమ్ముడిను కిరాతకంగా ప్రాణాలు తీశారు. ఈ  సంఘటన కోసిగిలో చోటుచేసుకుంది. తండ్రి దినకర్మ విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణ ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. మాటామాటా పెరిగి అన్న.. తమ్ముడిని బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామంలో నివాసముంటున్న మూకయ్యకు ముగ్గురు కుమారులు ఉన్నారు. మూడు రోజుల క్రితం తండ్రి మూకయ్య మృతి చెందాడు.

దీంతో.. పెద్ద కుమారుడితోపాటు తిక్కయ్య, వీరేష్ అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం దినకర్మ చేయాల్సి ఉంది. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన తిక్కయ్య  తన తమ్ముడు వీరేష్ ను బలంగా కొట్టాడు. వీరేష్(32) అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

దీంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తిక్కయ్య పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.