ఆయేషా ఏకలవ్యనగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని తన ఇద్దరి పిల్లలతో ఉంటోంది. ఆమె ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. 

వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్న ఓ వివాహితమై కామాంధుడి కన్నుపడింది. ఆమెను సొంతం చేసుకోవడానికి ఆమె ఇద్దరు పిల్లలను దూరం చేయాలని భావించాడు. ఈ క్రమంలో ఆమె ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేశాడు. బాలికను అమ్మేసి.. బాలుడిని దారుణంగా చంపేశాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నంద్యాల పట్టణం ములాన్‌పేటకు చెందిన ఇలియాస్‌, ఆయేషా దంపతులకు కుమారు పఠాన్‌ అఫ్జల్‌ ఖాన్‌(12), కూతురు (9) సంతానం. ఇలియాస్‌ మద్యానికి బానిస కావడంతో మూడేళ్ల క్రితం దంపతులు విడిపోయారు. ఆయేషా ఏకలవ్యనగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని తన ఇద్దరి పిల్లలతో ఉంటోంది. ఆమె ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. ఆయేషాకు ఏకలవ్యనగర్‌కి చెందిన చాకలి నాగకృష్ణ అలియాస్‌ కిట్టుతో పరిచయం ఉంది. చిన్నారులను బాగా చూసుకుంటానని కుటుంబానికి చేరువయ్యాడు.

ఈ క్రమంలో అనుకోకుండా పిల్లలు ఇద్దరూ అదృశ్యమయ్యారు. దీంతో.. పిల్లల తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులుకు అసలు నేరస్థుడు ఎవరో తెలిసిపోయింది. నాగకృష్ణ పిల్లలను కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు.

బాలుడిని చంపేసి.. బాలికను బెంగళూరు అమ్మేసినట్లు నేరం అంగీకరించాడు. బాలికను బెంగళూరులో పిల్లలు లేనివారికి రూ.28 వేలకు అమ్మేశామని ఒప్పుకున్నారు. పఠాన్‌ అఫ్జల్‌ ఖాన్‌ను తిరిగి నంద్యాలకు తెచ్చామని, తన చెల్లెలిని అమ్మిన విషయం తల్లికి చెబుతాడేమోనన్న అనుమానంతో మద్యం మత్తులో గొంతునులిమి చంపేశామని నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. బాలుడి మృతదేహాన్ని చాబోలు వద్ద కేసీ కెనాల్‌లో పడేశామని పోలీసులకు తెలిపారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. బెంగళూరులో ఉన్న బాలికను నంద్యాల త్రీటౌన్‌ పోలీసులు తీసుకువచ్చి తల్లికి అప్పగించారు