శ్రీ బాలాజీ జిల్లా రేణిగుంట గురువరాజుపల్లి ఎస్టీ కాలనీలో భార్య, ఏడాది కుమార్తెను భర్త దారుణంగా హత్య చేశాడు. 

శ్రీ బాలాజీ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రేణిగుంట గురువరాజుపల్లి ఎస్టీ కాలనీలో భార్య, ఏడాది కుమార్తెను భర్త దారుణంగా హత్య చేశాడు. నాలుగు రోజులుగా పావని, ఏడాది పాప కనిపించకపోవడంతో పావని బంధువులు రేణిగుంట అర్బన్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల విచారణలో భార్యాబిడ్డలను తానే హత్య చేసినట్లు భర్త కుమార్ అంగీకరించాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.