భర్త శ్రీను మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని 3 నెలల క్రితం భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టారు. ఇదే సమయంలో నిర్మల సభ్యురాలిగా ఉన్న సంఘానికి ప్రభుత్వం రూ. 10 లక్షల నగదు రుణంగా మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని సంఘం అధ్యక్షురాలు సభ్యులందరికీ ఒక్కొక్కరికి రూ. లక్ష వరకు జమ చేశారు. నిర్మల పుట్టింటికి వెళ్లడం తో ఆమె బ్యాంకు పాస్ పుస్తకం లో ఫోటోలు మార్చాడు.
విస్సన్నపేట : భార్యకు ప్రభుత్వం Loanగా ఇచ్చిన డబ్బును తన సొంతం చేసుకునేందుకు ఆమె స్థానంలో వేరే మహిళలు భార్యగా చూపించి నగదు తీసుకుని పరారైన husband ఉదంతం ఇది. విస్సన్నపేటకు చెందిన చల్లా నిర్మల శ్రీసాయి స్వశక్తి సంఘంలో సభ్యురాలిగా ఉంటూ ఎప్పటికప్పుడు పొదుపు, గత రుణానికి సంబంధించిన మొత్తం అన్ని సక్రమంగా చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె భర్త శ్రీను మరో మహిళతో extra marital affair పెట్టుకొని 3 నెలల క్రితం భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టారు.
ఇదే సమయంలో నిర్మల సభ్యురాలిగా ఉన్న సంఘానికి ప్రభుత్వం రూ. 10 లక్షల నగదు రుణంగా మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని సంఘం అధ్యక్షురాలు సభ్యులందరికీ ఒక్కొక్కరికి రూ. లక్ష వరకు జమ చేశారు. నిర్మల పుట్టింటికి వెళ్లడంతో ఆమె Bank pass bookలో ఫోటోను మార్చాడు. అంతేకాదు సంతకాన్ని ఫోర్జరీ చేసి.. అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను.. తన భార్యగా స్థానిక సప్తగిరి బ్యాంకు అధికారులను నమ్మించి.. నగదు మొత్తాన్ని విత్డ్రా చేశాడు.
విషయం తెలుసుకున్న నిర్మల బ్యాంకు అధికారులను ఆశ్రయించగా.. అప్పటికే శ్రీను నగదు డ్రా చేసిన మహిళతో ఉడాయించాడు. విషయం బయటకు వస్తే తమ బ్యాంకు పరువు పోతుందని భావించిన బ్యాంకు అధికారులు కొందరు గ్రామ పెద్దల సహాయంతో నిర్మలతో రాజీ చేసుకుని ఆమె పేరుతో కొత్త ఖాతా ప్రారంభించి.. కొంత నగదు అందులో జమ చేశారు. ఈ ఘటనపై బాధితురాలు నిర్మలను విచారించగా.. తన భర్త తనకు మంజూరు అయిన నగదుతో.. మరో మహిళతో పరారయ్యాడని తెలిపింది.
బ్యాంకు మేనేజర్ రఘును విచారించగా నిర్మల ఖాతాలో నగదు దుర్వినియోగం అయినా ఆమెకు ఎటువంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఆమెకు తెలియకుండా ఆమె భర్త డ్రా చేసి పరారైన మాట వాస్తవమేనని వెలుగు సిబ్బంది తెలిపారు.
ఇదిలా ఉండగా, Maharashtraలో ఆదివారం నాడు ఓ భర్త..రెండో భార్య కావాలంటూ వేయించిన బ్యానర్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు second wife కావాలంటూ నగరం మొత్తం బ్యానర్లు ఏర్పాటు చేశాడో వ్యక్తి. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. కొద్ది రోజుల్లో Aurangabad మున్సిపల్ ఎన్నికలు రానున్నాయి. రమేశ్ పాటిల్ అనే వ్యక్తి పోటీ చేయాలనుకున్నాడు.
కానీ, అతనికి ముగ్గురు పిల్లలు ఉండటం వల్ల ఎన్నికల్లో పోటీచేసే అర్హత కోల్పోయాడు. ఎలాగైనా బరిలో నిలవాల్సిందేనని పట్టుదలతో ఉన్న రమేష్.. ఓ ఉపాయం ఆలోచించాడు. తాను నిలబడలేకపోయినా.. తన కుటుంబంలో నుంచి ఒకరిని పోటీలో నిలపాలనుకున్నాడు.
అయితే, సోదరుడు, సోదరి, తల్లిదండ్రులను కాదండోయ్.. రెండో పెళ్లి చేసుకుని వచ్చే భార్యను ఎన్నికల్లో పోటీ చేయించాలని సంకల్పించుకున్నాడు. ఈ నేపత్యంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు రెండో భార్య కావాలంటూ ఏకంగా ఔరంగాబాద్ మొత్తం బ్యానర్లు కట్టించాడు.
తనకు కాబోయే భార్య ఎలా ఉండాలో అందులో పేర్కొన్నాడు. పెళ్లి అయి ఉంటే ఆ మహిళకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలనే షరతు కూడా విధించాడు. తన ఫోన్ నంబర్ సైతం బ్యానర్లలో అచ్చు వేయించాడు. ఇప్పుడు ఆయన ప్రకటనపైనే నగర జనం మొత్తం చర్చించుకుంటున్నారు.
