ఆన్‌లైన్ జూదం మరొకరి ప్రాణాలను బలి తీసుకొంది. ఇటీవలనే ఆన్‌లైన్ జూదానికి విశాఖలో ఒకరు మరణించారు.ఈ ఘటన మరువకముందే మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
విశాఖపట్టణం: ఆన్‌లైన్ జూదం మరొకరి ప్రాణాలను బలి తీసుకొంది. ఇటీవలనే ఆన్‌లైన్ జూదానికి విశాఖలో ఒకరు మరణించారు.ఈ ఘటన మరువకముందే మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఆన్ లైన్ జూదానికి లక్షలాది రూపాయాలు నష్టపోయిన సతీష్ అనే వ్యక్తి రైలు కింద ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
జిల్లాలోని గోపాలపట్నం మండలం కొత్తపాలెంలో సతీష్ కుమార్ అనే వ్యక్తి విశాఖ డాక్ యార్డులో పనిచేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండాల్సి రావడంతో ఆన్ లైన్ జూదానికి అలవాటుపడ్డాడు.
వ్యక్తిగత విభేదాల కారణంగా భార్యతో సతీష్ దూరంగా ఉంటున్నాడు. భార్య లేకపోవడంతో లాక్ డౌన్ తో సతీష్ ఆన్ లైన్ జూదానికి బానిసగా మారాడు.ఆన్ లైన్ జూదంలో సతీష్ లక్షలాది రూపాయాలను నష్టపోయాడు. తన వద్ద డబ్బు లేకపోయినా అప్పు తీసుకొని జూదంలో పెట్టుబడిపెట్టాడు.
అప్పులు పెరిగిపోవడంతో సతీష్ శనివారం నాడు రాత్రి మేఘాద్రిగడ్డ డామ్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొన్నాడు.సతీష్ కుమార్ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
