ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి నది ఉగ్రరూపం కొనసాగుతోంది. ఈ క్రమంలో గోకవరం మండల పరిధిలో గల కృష్ణునిపాలెం గ్రామ పంచాయతీలో వరద ఉద్ధృతికి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

మండలంలోని కృష్ణుని పాలెం సంజీవనగర్ వద్ద ఉరకాలువలో వరద ఉద్ధృతికి కాలువ దాటపోయి ప్రమాదవశాత్తూ కాకర్ల సత్తయ్య అనే వ్యక్తి మరణించాడు. కాలువలో కొట్టుకుపోవడాన్ని గమనించిన స్థానికులు అతనిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ఉగ్రరూపం దాల్చి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఊరకాలువ ఆక్రమణలకు గురై వరద ప్రవాహం పెరిగిపోతోంది.

దీనిపై గత ఏడాది కాలంగా మీడియాలో వరుస కథనాలు వచ్చినా సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఆక్రమణలు రోజురోజుకు పెరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు తక్షణం స్పందించి ఊర కాల్వ చుట్టూ ఉన్న ఆక్రమణలు తొలగించాలని పలువురు కోరుతున్నారు. 

 

"