ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తక్షణమే ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా వినుకొండలో ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. నవతరం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.కె నాయుడు వినుకొండలోని ఎన్ఎస్‌పీ కాలనీలోని దూరదర్శన్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. స్థానికుల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని కిందికి దింపే ప్రయత్నాలు చేస్తున్నారు.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తక్షణమే ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా వినుకొండలో ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. నవతరం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.కె నాయుడు వినుకొండలోని ఎన్ఎస్‌పీ కాలనీలోని దూరదర్శన్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. స్థానికుల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని కిందికి దింపే ప్రయత్నాలు చేస్తున్నారు.
సెల్‌ఫోన్ ద్వారా యువకుడితో మాట్లాడినా అతను కిందకు దిగేందుకు నిరాకరిస్తున్నాడు. వినుకొండ తహశీల్దార్ వచ్చి ప్రధానమంత్రిని కలిసేందుకు అపాయింట్ మెంట్ ఇప్పిస్తేనే కిందకు దిగుతానని పోలీసులకు తేల్చి చెప్పాడు. హోదా కోసం యువకుడు టవరెక్కాడన్న విషయం దావానంలో వ్యాపించడంతో రాజకీయ నేతలు యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Last Updated 9, Sep 2018, 11:19 AM IST