లైంగిక వాంఛ తీర్చలేదని మహిళను కత్తెరతో విచక్షణారహితంగా పొడిచి చంపాడో కామాంధుడు. ఆ తరువాత ఇంట్లోనే స్నానం చేసి రక్తపు మరకలు తొలగించుకుని.. వెళ్లిపోయాడు. ఈ హత్య కేసులో పోలీసులు చేధించారు. 

ఆముదాలవలస : ఆముదాలవలస పట్టణంలో ఓ woman దారుణ murderకు గురైన ఘటన వెనుక కారణాలను police ఒక్కరోజులోనే ఛేదించారు. Sexual desire తీర్చలేదని కోపంతోనే ఓ యువకుడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. సోమవారం ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ పైడయ్య విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పొందూరు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన సీపాన మహేష్ కు సదరు మహిళ తో గతంలో పరిచయం ఉంది. ఈ నెల 4న ఆమెతో ఫోన్ లో మాట్లాడి ఇంటికి వస్తున్నట్లు చెప్పాడు.

తర్వాత స్కూటీపై రాగోలు మీదుగా ఆముదాలవలస మార్కెట్ కమిటీ వద్దకు వచ్చాడు. అక్కడే వాహనాన్ని ఉంచాడు. ఆమె ఇంటికి ఉదయం 10.20 నుంచి 10:45 మధ్యలో చేరుకున్నాడు. ఇంట్లో ఆమెతో మాట్లాడుతూ లైంగిక వాంఛ తీర్చాలని కోరాడు. దీనికి ఆమె ఒప్పుకోలేదు. అయినా ప్రాధేయపడ్డాడు. నిరాకరించడంతో కోపంతో పక్కనే ఉన్న కుట్టుమిషన్ కత్తులతో మెడ భాగంలో పొడవడంతో బలమైన గాయం కాగా ఆమె అరిచింది. సమీపంలో ఉన్న వారికి కేకలు వినిపించడంతో వారు వచ్చి చూశారు.

దీంతో ఆమె నోటి నిందితుడు మూసివేయడంతో వారు వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. బతికి ఉంటే ప్రమాదమని కత్తులతో విచక్షణారహితంగా వీపు మెడ మీద ఇరవై నాలుగు సార్లు పొడవడంతో ఆమె మృతిచెందింది. నిందితుడి ఒంటిపై రక్తం మరకలు ఉండడంతో బాత్రూం లో స్నానం చేసి దుస్తులు వేసుకుని ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయాడు. రాత్రి అయినా ఆమె తలుపు ఇంతకీ తీయకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి తలుపులు తెరవగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పెనుగులాటలో నిందితుడికి స్వల్పగాయాలయ్యాయి. అనుమానం రాకుండా సంతకవిటి మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బండి మీద నుంచి పడి పోయాను అని చెప్పి చికిత్స చేయించుకున్నాడు.

 మృతురాలి తల్లి గురుగుబెల్లి అమ్మడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. చేస్తామన్నారు. సెల్ కాల్ రికార్డింగ్, క్లూస్ టీం సేకరించిన ఆధారాలు, సిసి ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకుని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. పోలీసు సిబ్బంది కి అభినందనలు తెలిపారు. ఎస్సై కృష్ణ పాల్గొన్నారు. 

ఇదిలా ఉండగా, తన భర్త frined harrasement భరించలేక దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన married woman మౌనిక (24) ఈ నెల 5న పురుగుల మందు తాగగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్ ఐ సాంబమూర్తి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అత్త, భర్త, తల్లి కలిసి ఇంటి ముందు మాట్లాడుకుంటుండగా మౌనిక పురుగుమందు తాగి.. వాంతులు చేసుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఆమె భర్త స్నేహితుడు, అదే గ్రామానికి చెందిన మోట పలుకుల ప్రశాంత్ (28) ఫోన్లో మానసికంగా వేధిస్తుండటంతో.. ఎవరికి చెప్పుకోవాలో తెలియక మనస్థాపంతో పురుగులమందు తాగిందన్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది అన్నారు. మౌనికకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మృతురాలి తల్లి సుగుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు 

కాగా, స్నేహితుడి భార్యను వేధించడం.. ఆమె ఆత్మహత్యకు పాల్పడడంతో.. అవమానంగా భావించిన మోటపల్కుల ప్రశాంత్ (28) సోమవారం రామగుండం దగ్గర దగ్గర రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రశాంత్ కు ఏడాది పాప ఉంది.