గుంటూరు జిల్లా పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ సమీపంలో సెల్ఫీ  దిగుతూ  కిందపడిన  కటకం వీరభద్రుడు  మరణించాడు. 

గుంటూరు: గుంటూరు జిల్లా పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలు బండిపై సెల్పీ దిగుతూ విద్యుత్ షాక్ కు గురైన కటకం Veerabadrudu మరణించాడు. selfie దిగుతూ వీరభద్రుడు గాయపడ్డారు. వెంటనే అతడిని Guntur ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వీరభద్రుడు మరణించినట్టుగా వైద్యులు ప్రకటించారు. పోస్టుమార్గం తర్వాత వీరభద్రుడి మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వీరభద్రుడి స్వగ్రామం గుంటూరు జిల్లాలోని మాచవరం మండలం వేమవరం గ్రామం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

గతంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో సెల్ఫీ వీడియోల మోజులో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటు చేసుకొన్నాయి. నదులు, కొండ ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాల్లో సెల్పీ మోజులో ప్రమాదానికి గురైన ఘటనలున్నాయి. సెల్పీలు తీసుకొనే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నా కూడా పట్టించుకోవడం లేదు. గుంటూరు జిల్లా ఘటనలో కూడా అదే జరిగిందని పోలీసులు చెబుతున్నారు. గూడ్స్ రైలుపై విద్యుత్ వైర్లు ఉన్న విషయాన్ని సరిగా పట్టించుకోని వీరభద్రుడు నిర్లక్ష్యంగా సెల్ఫీ దిగడానికి ప్రయత్నించి వి్యుత్ షాక్ కు గురయ్యాడని పోలీసులు చెబుతున్నారు. అయితే విద్యుత్ షాక్ తో తీవ్రంగా గాయపడిన వీరభద్రుడిని కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని పోలీసులు చెప్పారు.