కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తిరువూరు మండలంలో కుటుంబ కలహాలతో భార్యను దారుణంగా హతమార్చాడు భర్త. ఈ ఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది.  ఈ ఘటన టేకులపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెడితే.. గత కొన్ని రోజులుగా భార్యమీద భర్తకు అనుమానం ఉంది. చాలాసార్లు అనుమానించాడు. దీనిమీదే భార్య పద్మావతి, భర్త సత్యనారాయణ రెడ్డి మధ్య వివాదం చోటు చేసుకుంది. అర్థరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో భార్యను భర్త సత్యనారాయణ రెడ్డి దారుణంగా గొడ్డలితో హతమార్చాడు. 

ఆస్తి రాసిస్తావా.. దగ్గమంటావా..? భర్తకి మాజీ భార్య బెదిరింపులు..!...

భార్యను చంపిన తరువాత కుమారుడు వెంకట్ రెడ్డి మీద కూడా గొడ్డలితో దాడి చేశాడు. తండ్రి దాడి నుంచి కొడుకు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికులు బాధితుడిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు. సమాచార తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

హంతకుడు బైక్ పై పారిపోతుండగా రెడ్డిగూడెం శివారులో పోలీసులు అదుపులోకి తీసుకుని నిందితుడిపై కేసు నమోదు చేశారు.