పుట్టింటికి వచ్చిన చెల్లెలిని ప్రేమగా చూసుకోవాల్సింది పోయి.. ఆమె మీద దారుణానికి తెగబడ్డాడో అన్న. చికెన్ వండలేదని మద్యం మత్తులో పనికిరాని ఆవేశంతో ఆమె మీద దాడి చేసి చంపేశాడు.
కూనవరం : chicken curry వండలేదని సోదరుడే చెల్లిని చంపిన సంఘటన East Godavari District కూనవరం మండలం కన్నాపురంలో చోటుచేసుకుంది. సీఐ గజేంద్ర కుమార్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం… కన్నాపురానికి చెందిన కొవ్వాసి నంద కూలీ చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆయనను చూసేందుకు telanganaలోని కరకగూడెం మండలం మాదన్నగూడెంలో నివసిస్తున్న చెల్లెలు సోమమ్మ(20) వారం కిందటే కన్నాపురం వచ్చింది. రెండు రోజుల్లో వస్తాను అని నంద భార్య పుట్టింటికి వెళ్ళింది. నంద గురువారం రాత్రి పదింటికి liquor మత్తులో కోడి మాంసం ఇంటికి తీసుకొచ్చాడు.
కోడి కూర వండు అన్నాడు. సోమమ్మ నీరసంగా ఉందని చెప్పడంతో గొడవకు దిగాడు. ఇంటికి వచ్చేసరికి ఉండాలని చెప్పి అతడు బయటకు వెళ్ళిపోయాడు. శుక్రవారం తెల్లవారుజామున వచ్చిన నంద కోడి కూర వడ్డించాలని కోరగా.. ఆమె వండలేదని చెప్పడంతో దాడికి యత్నించాడు. ఆమె అరుస్తూ బయటకు పరిగెడుతూ ఉండగా వెంటాడి గొడ్డలితో నరికాడు. ఆమె కేకలు విన్న చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకునేసరికి సోమమ్మ రక్తపు మడుగులో కొట్టుకుంటూ ప్రాణాలు వదిలింది. అతడిని గ్రామస్తులు చెట్టుకు కట్టేశారు. నిందుతుడిని అదుపులోకి తీసుకున్నామని సిఐ తెలిపారు.
ఇలాంటి ఘటనే నిరుడు నవంబర్ లో బీహార్ లో చోటు చేసుకుంది. కోడి కూర వండ లేదన్న కోపంతో భార్యాభర్తల మధ్య గొడవ ప్రాణాల మీదికి తీసుకువచ్చింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి ఇరుగుపొరుగు సహాయంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. చంపారన్ జిల్లాలోని బేతియా నగరంలో నాగేంద్ర సింగ్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించడంతో కేసు వెలుగులోకి వచ్చింది. తన అల్లుడు తన కూతురిని హత్య చేయాలని ప్రయత్నించాడని, ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని నాగేంద్ర సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు విచారణ చేయగా.. భార్యాభర్తల మధ్య జరిగిన చిన్నపాటి గొడవే ప్రాణాల మీదికి తెచ్చిందని తేల్చారు.
పోలీసుల కథనం ప్రకారం.. బేతియా నగరానికి చెందిన రాహుల్ కుమార్ (26)కు పక్క గ్రామం పహాడ్ పూర్ లో నివసించే నాగేంద్ర సింగ్ కుమార్తె ఆర్తి దేవి (19) తో 8 నెలల క్రితం వివాహం జరిగింది. ఆర్తి దేవికి చిన్నప్పటి నుంచి నాన్ వెజిటేరియన్ తినడం ఇష్టం లేదు. ఎక్కువగా శాకాహారమే తినేది. కానీ రాహుల్ కుమార్ కు చికెన్, మటన్ అంటే చాలా ఇష్టం. వీరిద్దరికీ వివాహమైన తర్వాత ఆర్తి దేవి మాంసాహారం వండడానికి భర్తతో తరచుగా గొడవ పడేది. తాను తినక పోయినా భర్త సంతోషం కోసం అప్పుడప్పుడు చికెన్ వండేది. కానీ రాహుల్ కు మాత్రం రోజు మాంసాహారం కావాలి. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.
ఇదే క్రమంలో రాహుల్ కుమార్ నవంబర్ 15న ఇంటికి చికెన్ తీసుకొచ్చి భార్యను వడ్లమన్నాడు. ఆ రోజు ఏకాదశి కావడంతో ఆర్తి మాంసాహారాన్ని ముట్టుకోను అని చెప్పింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య మళ్ళీ గొడవ మొదలైంది. ఒక వైపు రాహుల్ ఎలాగైనా ఈ రోజు చికెన్ తినాల్సిందే పట్టుకుని కూర్చోగా మరో వైపు ఆర్తి ఏకాదశి రోజు ఇంట్లో మాంసాహారం వండడానికి వీలు లేదని భీష్మించుకు కూర్చుంది. చివరికి రాహుల్ కు ఏం చేయాలో తోచక ఇంటి బయట వరండాలో చికెన్ వండడం మొదలుపెట్టాడు.
ఇది గమనించిన ఆర్తి.. భర్త రాహుల్ చాలా పెద్ద తప్పు చేశాడని… ఏకాదశి రోజు అలా చేయడం ఇంటికి అరిష్టం అని భావించిన ఆర్పి తీవ్ర మనస్థాపానికి లోనయింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో తీవ్ర గాయాలపాలైంది. ఇది గమనించిన రాహుల్ వెంటనే మంటలను ఆర్పి, ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో భర్త రాహుల్ కూడా స్వల్పంగా గాయపడ్డాడు.
