కట్టుకున్న భార్యను ఓ కిరాతక భర్త అతి దారుణంగా హతమార్చిన సంఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. మద్యంమత్తులో విచక్షణ  కోల్పోయిన భర్త తన  భార్యను చితకబాదడమే కాదు కిరాలకంగా గొంతు నులిమి హత్య చేశాడు. అయితే భార్య వేరే వ్యక్తితో అక్రమసంబంధాన్ని కలిగివుందన్న అనుమానంతోనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. 

ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బీమిలి సమీపంలోని పీఎం పాలెంకు చెందిన సింహాచలం ఆటో డ్రైవర్. అతడి  భార్య  పద్మ స్థానికంగా ఓ టీ కొట్టు నడుపుతుండేది. వీరికి ఓ అబ్బాయి, అమ్మాయి సంతానం. గత పదెళ్లుగా అన్యోన్యంగా సాగుతున్న వీరి సంసారాన్ని మద్యం అల్లకల్లోలం చేసింది. 

టీకొట్టు  నడుపుతున్న పద్మ అక్కడకి వచ్చేవారితో కాస్త చనువుగా మాట్లాడేది. ఇది భర్తకు నచ్చకపోడంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో నిత్యం మద్యంసేవించి  ఇంటికి వచ్చే సింహాచలం భార్యతో గొడపడేపాడు. రాను రాను అతడి అనుమానం  ఫెను భూతంగా మారింది. భార్య వేరే వ్యక్తులతో అక్రమ సంబంధాన్ని కలిగివుందని అతడే ఓ నిర్దారణకు వచ్చాడు. దీంతో తనను మోసం  చేస్తున్న భార్యను హతమార్చాలని భావించాడు. 

దీంతో గురువారం అర్ధరాత్రి ఫుల్లుగా మద్యం సేవించి సింహాచలం ఇంటికి వచ్చాడు.  ఇంట్లో వస్తూనే భార్య మెడపై కాలితో అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి అతి కిరాతకంగా హతమార్చాడు.  ఆ తర్వాత  అతడు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. 
 
తల్లి చనిపోవడం, హంతకుడుగా  మారిన తండ్రి జైలుపాలవడంతో ఇద్దరు చిన్నారులు అనాధలుగా మారారు. ఇలా మద్యం మహమ్మారి, అనుమానం ఓ మహిళ హత్యకు కారణమవడంతో పాటు ఇద్దరు చిన్నారులను అనాధలనుు చేసింది.