Asianet News TeluguAsianet News Telugu

స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీక ‘‘రణం’’ : కదం తొక్కిన కార్మిక సంఘాలు.. సాగర తీరంలో మహాకవాతు

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న సంగతి తెలిసిందే. 

maha kavathu in visakhapatnam against steel plant privatization ksp
Author
Visakhapatnam, First Published Apr 4, 2021, 8:40 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న సంగతి తెలిసిందే. కార్మిక, విద్యార్ధి, రాజకీయ సంఘాలు నిరసనను తెలియజేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆదివారం విశాఖ సాగర తీరాన కార్మిక సంఘాలు ‘మహా కవాతు’ చేపట్టాయి. ఈ కార్యక్రమంలో సుమారు 2 వేల మంది అఖిలపక్ష కార్మిక, నిర్వాసిత సంఘాల నాయకులు, కార్మికులు, ప్రజలతోపాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు.

విశాఖ ఆర్‌కే బీచ్‌ నుంచి మధ్యాహ్నం మొదలుపెట్టిన ఈ మహాకవాతు బీచ్‌లోని వైఎస్‌ఆర్‌ విగ్రహం వరకు సాగింది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని ఈ సందర్భంగా కార్మిక నేతలు పిలుపునిచ్చారు.

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో ఈ నెల 18న నిర్వహించనున్న ‘మహాసభ’ సన్నాహక ఏర్పాట్లలో భాగంగా కవాతు నిర్వహించినట్లు వారు వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios