Magunta Sreenivasulu Reddy Biography: 2024 ఎన్నికల్లో భాగంగా ఒంగోలు నియోజకవర్గం నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డికి బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి రియల్ స్టోరీ మీ కోసం..  

Magunta Sreenivasulu Reddy Biography: నెల్లూరుకు చెందిన పలువురు రాజకీయ నేతలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా రాణించారు. వారందరిలో ప్రత్యేక స్థానంలో నిలిచే వ్యక్తి  దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి. ఆయన ఎంపీగా పని చేసింది ఒక్కసారే అయినా తన సేవా కార్యక్రమాలతో ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన సోదరుడే మాగుంట శ్రీనివాసులు రెడ్డి. మాగుంట శ్రీనివాసులు రెడ్డి గురించి కంటే ముందు ఆయన అన్నయ్య మాగుంట సుబ్బరామిరెడ్డి గురించి తెలుసుకుందాం. 

సుబ్బరామిరెడ్డి ప్రొఫైల్ 

ఆయన అన్నయ్యనే సుబ్బరామిరెడ్డి. ఆయన కుటుంబానికి పెద్దగా ఉంటూ.. అందరి బాగోగులు చూసుకునే వారు. ఆయన అనేక వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి సక్సెస్ అయ్యారు.  అనతికాలంలోనే దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగారు. సుబ్బరామిరెడ్డి ప్రజలకు తనకు తోచిన సహాయం  చేశాయాలని భావించారు. ఇలా దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ ఆశీస్సులతో సుబ్బరామిరెడ్డి 1991 లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఈ సమయంలో పార్టీ తనకు ఎలాంటి పరిచయాలు లేని ప్రకాశం జిల్లా ఒంగోలు లోక్ సభ టికెట్ ను కేటాయించిన పార్టీ ఆదేశాలతో పోటీ చేసేందుకు ముందుకు వచ్చారు.  

రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజుల్లో ఎన్టీఆర్ వేవ్  వీస్తున్న గెలుపు మాత్రం మాగుంట సొంతం. ఇలా లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.  ఒంగోలులో ఇల్లు నిర్మించుకొని ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఎన్నికలవేళ ప్రజల కష్టాలను చూసిన మాగుంట   ప్రభుత్వ నిధులతో వారి కష్టాలను తీరుస్తూనే మరోపక్క మాగుంట చారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేసి , పలు సేవా కార్యక్రమాలు చేశారు. అలాగే.. పేద ప్రజల విద్యకు పెద్దపీట వేశారు. అలాగే.. మాగుంట సుబ్బరామిరెడ్డి పేరుతో జూనియర్, డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేశారు. ఇలా అనతికాలంలోనే  
కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయికి నాయకుడుగా ఎదిగారు. ఈ సమయంలో (1995 డిసెంబర్ 1న) ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు నాయకులు జరిపిన కాల్పుల్లో సుబ్బరామిరెడ్డి మరణించారు.

ఈ సమయంలో సుబ్బరామిరెడ్డి రాజకీయ వారసుడిగా వచ్చిన వ్యక్తే మాగుంట శ్రీనివాస్. ఇక  మాగుంట శ్రీనివాసులు వ్యక్తిగత రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే..

మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రొఫైల్ 

మాగుంట శ్రీనివాస్ రెడ్డి 1953 అక్టోబర్ 15 నెల్లూరులో జన్మించారు.  ఇక ఆయన వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే.. ఆయన భార్య పేరు మాగుంట గీతాలత. వారికి ఇద్దరు సంతానం.

సుబ్బరామిరెడ్డి మరణనంతరతం 1998లో ఆయన రాజకీయ వారసుడిగా శ్రీనివాసులు రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఒంగోలు లోక్సభ నుంచి సుబ్బరామిరెడ్డి చిన్న తమ్ముడు శ్రీనివాసులు రెడ్డి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో వరుసగా ఒంగోలు ఎంపీగా , కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. 

కాంగ్రెస్ కు రాజీనామా

2014 ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిడిపిలో చేరారు. కానీ,  2014లో ఒంగోలు ఎంపీగా టిడిపి తరఫున పోటీ చేసిన ఆయన ఓటమిపాలయ్యారు. కానీ, 2015లో ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల తరుపున శాసనమండలి సభ్యునిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

టీడీపీకి రాజీనామా

కానీ, పార్టీలో తలెత్తిన అంతర్గత కారణాల వల్ల ఆయన 2019 మార్చి 16న టిడిపికి రాజీనామా చేసి వైఎస్ఆర్సిపి లో చేరారు.  ఇక 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఒంగోలు లోక్ సభ స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి భారీ విజయాన్ని సాధించారు.  2024 ఫిబ్రవరి 28న పలు కారణాలతో వై ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన తర్వాత మార్చి 16న తెలుగుదేశం పార్టీలో చేరారు. 

వాస్తవానికి ఈ ఎన్నికల్లో ఆయన తన కుమారుడు రాఘవరెడ్డిని ఎంపీగా బరిలో నిలుపాలని భావించారు. కానీ, ఈసారి ఎన్నికల్లో మాత్రం ఆయననే పోటీచేయాలని చంద్రబాబు కోరారు.  తాజాగా మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్ కేటాయించారు. ఇక ఇక్కడ వైసిపి తరపున భాస్కర్ రెడ్డి పోటీ చేస్తున్నారు  

 వివాదాలు

వందల కోట్ల ఆస్తులున్నా ఆయన పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అయితే.. ఆయనకు ఎక్సైజ్ డ్యూటీ కేసుతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.