ఏపీకి మళ్లీ.. సీఎం చంద్రబాబు నాయుడే కావాలని కోరుకుంటూ.. మచిలీపట్నానికి చెందిన టీడీపీ నేతలు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. 2019లో టీడీపీ అధికారంలోకి రావాలని కోరుతూ శనివారం పలువురు టీడీపీ నేతలు అలిపిరి పాదాల మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మచిలీపట్నం నుంచి పాదయాత్రగా తిరుపతికి చేరుకున్న వీరు.. అలిపిరి పాదాల మండపం  నుంచి కాలి నడకన తిరుమల వెళ్లారు. రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబే మళ్లీ సీఎం కావాలని వారు ఈ సందర్భంగా స్వామివారిని కోరుకున్నారు. వెంకన్న ఆశీస్సులు టీడీపీకి ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని తాము పాదయాత్ర చేసినట మచిలీపట్నం టీడీపీ నేతలు ఈ సందర్భంగా వివరించారు.