Asianet News TeluguAsianet News Telugu

36 గంటల దీక్ష అయిపోగానే హైదరాబాద్‌ పారిపోతారు: బాబుపై బాలశౌరీ సెటైర్లు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) చేస్తున్న  దీక్షపై విమర్శలు గుప్పించారు బందరు (machilipatnam mp) వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరీ (vallabbhaneni balashowry) . 36 గంటల దీక్ష అయిపోగానే టీడీపీ అధినేత .. హైదరాబాద్ పారిపోతారని బాలశౌరి ఎద్దేవా చేశారు. బాబు తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

machilipatnam mp vallabbhaneni balashowry angry on tdp chief chandrababu
Author
Machilipatnam, First Published Oct 22, 2021, 2:58 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) చేస్తున్న  దీక్షపై విమర్శలు గుప్పించారు బందరు (machilipatnam mp) వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరీ (vallabbhaneni balashowry) . శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. 36 గంటల దీక్ష అయిపోగానే టీడీపీ అధినేత .. హైదరాబాద్ పారిపోతారని బాలశౌరి ఎద్దేవా చేశారు. బాబు తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అరాచక రాజకీయాల్లో చంద్రబాబు, టీడీపీని మించినవారు లేరని ఎద్దేవా చేశారు.  అమిత్ షా కాన్వాయ్ పై రాళ్ల దాడి చేయించిన ఘటనను బీజేపీ నేతలు ఇంకా మరచిపోలేదని బాలశౌరీ దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీని రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని.. పార్లమెంట్‌లో టీడీపీ అరాచకాలపై మాట్లాడతామని ఆయన తెలిపారు. ఢిల్లీలోని అన్ని పార్టీలకు చంద్రబాబు వైఖరిని తెలిపి ఎండగడతామని బాలశౌరీ చెప్పారు. 

కాగా.. గంజాయి, డ్రగ్స్ వ్యవహారంలో ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ నేత పట్టాభి కామెంట్లు, ఆ తర్వాత ఆయనపై, టీడీపీ ఆఫీసులపై వైఎస్సార్ సీపీ కార్యకర్తల దాడుల నేపథ్యంలో చంద్రబాబు 36 గంటల దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలతో ఏపీలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కినట్టయింది.

ALso Read:బూతులు మాట్లాడే హక్కు కోసం బాబు దీక్ష: సజ్జల రామకృష్ణారెడ్డి

అంతకుముందు వైసీపీ ప్రధాన  కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఎలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధిస్తారో చంద్రబాబుకు తెలియదా అని . ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత పట్టాభి బూతు వ్యాఖ్యలను నిరసిస్తూ  శుక్రవారం నాడు వైసీపీ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన  జనాగ్రహదీక్షలో Sajjala Ramakirishna Reddy ప్రసంగించారు. చంద్రబాబు రాష్ట్రపతి పాలన ఎలా కోరుకొంటారన్నారు.. ఆయనవి చిల్లర రాజకీయాలు అని ఆయన విమర్శించారు.

లేని అంశంపై Tdp రచ్చ చేస్తోందని ఆయన మండిపడ్డారు. సీఎం Ys Jagan పై Pattabhi అడ్డగోలుగా మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. ఇలా మాట్లాడించడం ద్వారా రాష్ట్రంలో ఘర్షణలకు కారణమయ్యేలా ప్రయత్నం చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. పట్టాభి నోరుజారి ఈ వ్యాఖ్యలు చేయలేదన్నారు. సీఎంను ఉద్దేశించి పట్టాభి బూతు పదాన్ని నాలుగైదు సార్లు ఉపయోగించారని సజ్జల  రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. ఈ మాటలను విన్న సీఎం జగన్ అభిమానులు కానీ, Ycp కార్యకర్తలు కానీ ఈ విషయమై ప్రశ్నించేందుకు అక్కడికి వెళ్లారన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios