గుంటూరు జిల్లాలో ఓ ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. చేబ్రోలు మండలం సుద్దపల్లి రైల్వేగేటు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

గుంటూరు జిల్లాలో ఓ ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. చేబ్రోలు మండలం సుద్దపల్లి రైల్వేగేటు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదనే కారణంతోనే వీరు ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. రైల్వే పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సెలపాడు గ్రామానికి చెందిన ఉయ్యూరు శ్రీకాంత్‌, అదే గ్రామానికి చెందిన పులి త్రివేణి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే త్రివేణి తెనాలి డిగ్రీ కాలేజ్‌ నుంచి శ్రీకాంత్‌తో వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించి త్రివేణి స్నేహితులు ఆమె తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. 

దీంతో త్రివేణి తల్లిదండ్రులు.. తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే ఈరోజు ఉదయం సుద్దపల్లి రైల్వేగేటు వద్ద మృతదేహాలను గుర్తించారు. ఇక, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.