Asianet News TeluguAsianet News Telugu

పెళ్లై, పిల్లలు పుట్టాక ప్రేమలో పడ్డారు.. విడిచి ఉండలేక ఆత్మహత్యాయత్నం...కానీ....

అదే గ్రామంలో నివసించే శ్యామల అనే వివాహిత,  గోపి మధ్య ఏడేళ్లక్రితం  వివాహేతర సంబంధం ఏర్పడింది.  ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.  రెండేళ్ల క్రితం పెద్ద మనుషులు ఈ ఇద్దరిని మందలించారు.  ఆ సమయంలో తీవ్ర మనస్తాపం చెందిన శ్యామల భర్త జూటూరి గోపి ఆత్మహత్య చేసుకున్నాడు.  

love couple suicide attempt in pedakakani, one dead
Author
Hyderabad, First Published Sep 13, 2021, 10:06 AM IST

అతనికి వివాహమై ఓ బాబు ఉన్నాడు.  ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.  అయినా  ఒకరికొకరు ఆకర్షితులై వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. పెద్దలు మందలించిన లెక్కచేయలేదు.  అయితే,  వేర్వేరు కుటుంబాలు,  కలిసి ఉండలేని పరిస్థితి…  ఈ వేదనతో వారు చివరికి ఆత్మహత్యాయత్నం చేశారు.  ఈ క్రమంలో ప్రియుడు మృతిచెందగా ఆమె చావు బతుకుల నడుమ కొట్టుమిట్టాడుతోంది.

ఈ ఘటన పెదకాకాని మండలం వెనిగండ్ల లో ఆదివారం జరిగింది. పాకాలపాడు కు చెందిన సందీప్ గోపి (30)కి వెనిగండ్లకు చెందిన ఓ యువతితో వివాహం కాగా,  వారికి ఓ బాబు ఉన్నాడు.  కొన్నాళ్ళ క్రితం వారు వెనిగండ్లకు వచ్చి స్థిరపడ్డారు.  గుంటూరు శివారు ఆటోనగర్లో  ఫర్నిచర్ దుకాణంలో  గోపి డ్రైవర్ గా పని చేస్తున్నాడు.

అదే గ్రామంలో నివసించే శ్యామల అనే వివాహిత,  గోపి మధ్య ఏడేళ్లక్రితం  వివాహేతర సంబంధం ఏర్పడింది.  ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.  రెండేళ్ల క్రితం పెద్ద మనుషులు ఈ ఇద్దరిని మందలించారు.  ఆ సమయంలో తీవ్ర మనస్తాపం చెందిన శ్యామల భర్త జూటూరి గోపి ఆత్మహత్య చేసుకున్నాడు.  

తర్వాత కూడా వీరి సంబంధం కొనసాగడంతో రెండు కుటుంబాల్లోనూ సమస్యలు ఎదురయ్యాయి.  దీనికి పరిష్కారం చావేనని ఇద్దరూ భావించారు.  నాలుగు రోజుల క్రితం గోపీ ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్లారు. రెండు రోజుల అనంతరం కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా కారు డ్రైవింగ్ నిమిత్తం వెళ్లానని, త్వరగా వచ్చేస్తానని చెప్పారు. 

తొమ్మిదేళ్లుగా సహజీవనం.. పెళ్లి చేసుకోమన్నందుకు కత్తితో దాడి చేసిన ప్రియుడు..!

అదే రోజు నుంచి శ్యామల కూడా కనిపించకుండా పోయింది. శనివారం రాత్రి కుటుంబ సభ్యులు మళ్లీ అతనికి ఫోన్ చేయగా.. తనతో పాటు శ్యామల ఉందని, తామిద్దరం స్థానిక సాయిబాబా ఆలయం ఎదుట ఉన్న పొలాల్లో పురుగుల మందు తాగామని తెలిపారు. 

వెంటనే ఆయన బంధువుల సంఘటన స్థలానికి వెళ్లగా, వాంతులు చేసుకుంటూ ఇద్దరూ కనిపింారు. వెంటనే వారిని గుంటూరు ప్రభుత్వాుపత్రికిి తరలించారు. కొద్ది సేపటికే గోపి చనిపోయాడు. శ్యామల పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రివెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బంగారు సురేష్ బాబు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios