తమ ప్రేమ గురించి పెద్దలకు చెప్పే ధైర్యం లేక, విడిపోయి బ్రతకలేక మనోవేదనకు గురయిన ఓ ప్రేమజంట చివరకు బలమన్మరణానికి పాల్పడిన విషాద ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.
విజయవాడ: వారిద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి మరొకరు వుండలేని స్థాయికి వారి ప్రేమ చేరకుంది. కానీ ఆ ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనన్న అనుమానంతో ఈ జంట దారుణం నిర్ణయం తీసుకున్నారు. పురుగుల మందు తాగి lovers suicide చేసుకున్నారు.
ఈ విషాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని కంచికచర్ల మండలం మోగులూరు గ్రామానికి చెందిన అరవింద్(25), నాగరాణి(21)కి ఒకరినొకరు ఇష్టపడ్డారు. కొన్నేళ్లుగా వీరిద్దరు ప్రేమాయణం సాగుతోంది. ఇంతకాలం సాఫీగా సాగిన ప్రేమను పెళ్లిపీటల వరకు తీసుకెళ్లాలని భావించారు. కానీ కుటుంబసభ్యులకు తమ ప్రేమ గురించి చెప్పి ఒప్పించే ధైర్యం చేయలేదు.
కుటుంబసభ్యులు ఎక్కడ తమ ప్రేమను అంగీకరించకుండా పెళ్ళికి ఒప్పుకోరోనని భయపడిపోయిన ఈ ప్రేమజంట దారుణ నిర్ణయం తీసుకున్నారు. కలిసి జీవితాన్ని పంచుకోవాలని ఎన్నో కలలు గన్న ప్రేమికులు చివరకు కలిసి బలవన్మరణానికి పాల్పడ్డారు.
read more భార్యపై అనుమానం.. ఎనిమిదేళ్ల కూతురి గొంతు కోసి చంపిన తండ్రి...
శనివారం రాత్రి అరవింద్, నాగరాణి పొలంపనుల కోసం దాచిన గడ్డిమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వీరిని గుర్తించిన కుటుంబసభ్యులు guntur ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. అక్కడి డాక్టర్లు వీరికి మెరుగైన చికిత్స అందించినా ఫలితంలేకుండా పోయింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి ఒకరు, సోమవారం తెల్లవారుజామున మరొకరు ప్రాణాలు కోల్పోయారు.
గ్రామానికి చెందిన యువతీయువకుల మరణంతో మోగులూరులో విషాదఛాయలు అలుముకున్నారు. ఇరువురి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రేమను పెద్దలకు చెప్పే ధైర్యం చేయలేక ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడ్డ ఘటనగురించి తెలిసి బాధపడనివారు లేరు.
read more విజయనగరంలో విషాదం: ఇంట్లో భార్య, తోటలో భర్త... ఉరేసుకుని నవదంపతుల ఆత్మహత్య
ఇలా ప్రేమించుకున్నా ఎక్కడ పెళ్లి జరగదేమోనన్న భయంతో ఓ జంట ఆత్మహత్య చేసుకుంటే... పెళ్లిచేసుకున్న భర్తను వంచిస్తూ మరొకరితో వివాహేతరసంబంధం పెట్టుకుని ఒకరి దారుణ హత్యకు కారణమయ్యింది ఓ మహిళ. రాజమండ్రిలోని బొమ్మూరు బత్తిననగర్ కు చెందిన దుర్గాప్రసాద్(35) ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ లో పని చేస్తున్నాడు. ఇతనికి వివాహమై, భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి ఇంటిపక్కనే రమేష్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి అద్దెకుంటున్నాడు. అయితే రమేష్ భార్యతో దుర్గా ప్రసాద్ కు extramarital affair నడుస్తోంది.
ఆ విషయం రమేష్ కు తెలియడంతో గొడవలు జరుగుతున్నాయి. వారం కిందట రమేష్ భార్య, పిల్లలను పుట్టింటికి పంపించాడు. దుర్గాప్రసాద్ murder చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం దేవి చౌక్ ప్రాంతానికి వచ్చిన దుర్గాప్రసాద్ ను వెంబడించి లింగంపేట వాంబే కాలనీ వద్ద knifeతో మెడపై పలుమార్లు దాడి చేసి పరారయ్యాడు.
ఈ దాడితో తీవ్రంగా గాయపడిన దుర్గాప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఈ దారుణాన్ని పోలీసులకు తెలిపారు. పోలీసులు వెంటనే దుర్గాప్రసాద్ ను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. విషయం ఆరాతీయగా రమేష్ ఈ హత్య చేసినట్లు తెలిసింది. రమేష్ కోసం వలపన్నిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
