బాపట్ల జిల్లాలోని మున్నంగివారిపాలెంలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో సూసైడ్ చేసుకున్నారు.
బాపట్ల:జిల్లాలోని మున్నంగివారిపాలెంలో ప్రేమ జంట మంగళవారంనాడు ఆత్మహత్య చేసుకుంది.తమ పెళ్లికి పెద్దలుఅంగీకరించకపోవడంతో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. మున్నంగివారిపాలెం గ్రామానికి చెందిన సుబ్బారావు,తేజలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.సుబ్బారావు పదో తరగతి చదువుకున్నాడు. వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు.తేజ ఇంటర్ ను మధ్యలో ఆపేసింది.వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కానీ వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు.దీంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.మృతదేహలను పోస్టుమార్టం కోసం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
