ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ మంత్రి, టీడీపీ నేత లోకేష్ పలు విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా జగన్ పై విమర్శల వర్షం కరిపించారు. రాష్ట్రంలోని ఆస్తులన్నింటినీ జగన్ అమ్మేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అమ్మేస్తూ..దానికి ''మిషన్ బిల్డ్ ఏపీ'' పేరు పెట్టారన్నారు. కాగా.. అది మిషన్ బిల్డ్ ఏపీ కాదని.. జగన్ కిల్డ్ ఏపీ అంటూ పేర్కొన్నారు.

‘‘తల్లిదండ్రుల గొంతు కోసి చంపిన  ఉన్మాది కొడుకు త‌రువాత వారికి పెద్ద గుడి కట్టిస్తానని ప్రకటించాడట. ఉన్మాది కొడుకులాగే  రాష్ట్రంలో ఆస్తుల‌న్నీ అమ్మేసి ఏపీని చంపేస్తూ దానికి ''మిషన్ బిల్డ్ ఏపీ'' పేరు పెట్టారు 
@ysjagan
. ఆ కార్యక్రమం పేరు ''మిషన్ బిల్డ్ ఏపీ'' కాదు ''జగన్ కిల్డ్ ఏపీ''’’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.