అమరావతి: రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్వి లోకేష్ కౌంటరిచ్చారు.అమరావతిలో బాలకృష్ణకు భూములున్నాయని వైఎస్ఆర్‌సీపీ నేతలు చేసిన విమర్శలపై ఆయన మండిపడ్డారు. దమ్ముంటూ నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. 

 

రాజధాని అమరావతి నిర్మాణంలో  టీడీపీ సర్కార్  అవినీతికి పాల్పడిందని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై లోకేష్ మండిపడ్డారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు ఇంకా  తాము ప్రతిపక్షంలోనే ఉన్నామనే భ్రమలో ఉన్నారని లోకేష్ ఎద్దేవా చేశారు.

 

అదికారంలోకి వచ్చిన తర్వాత కూడ ఫేక్ బతుకు మారలేదని ఆయన మండిపడ్డారు.అసత్యాలతో కాలం నెట్టుకొస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణపై ఆయన మండిపడ్డారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని దెబ్బతీసేందుకు అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  కూడ సెక్రటేరియట్ ముఖం కూడ చూడని వ్యక్తి బాలకృష్ణ అని ఆయన గుర్తు చేశారు. స్వచ్చమైన మనసు, నీతి, నిజాయితీతో నందమూరి బాలకృష్ణ ఎదిగారని ఆయన గుర్తు చేశారు. 

అలాంటి వ్యక్తి రాజధానిలో భూములు కొన్నారంటూ వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దమ్ముంటే ఈ విషయమై నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు.