ఏపీలో మద్యం ఎఫెక్ట్: తాగి భార్య, కూతురిని కొట్టిన తాగుబోతు, తల్లీకూతుళ్ల ఆత్మహత్య!

మద్యం సేవించిన ఒక వ్యక్తి ఇంటికి వచ్చి భార్యని, 18 సంవత్సరాల కూతురిని కొట్టడంతో మనస్తాపానికి గురైన వారిరువురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎలాగూ ఇన్ని రోజులు మద్యం  సేవించడం లేదు కదా, ఇక మానెయ్యొచ్చుకదా అని అడిగినందుకు భార్య, కూతురిపై చేయి చేసుకున్నాడు ఆ తాగుబోతు.  

Liquor shops opened in Ap: man Comes home drunk, beats his wife and daughter, they end lives

కాపురాలు పచ్చగా ఉండాలి, ఇండ్లలో గృహ హింస అనే పదం వినిపించగూడదు అని సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తామని చెప్పిన ఆంధ్రప్రదేశ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు నిన్న లాక్ డౌన్ తరువాత మద్యం షాపులను తెరవడానికి అనుమతులిచ్చారు. ఆ తెరిచిన మద్యం షాపులు నిన్న రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. 

మద్యం సేవించిన ఒక వ్యక్తి ఇంటికి వచ్చి భార్యని, 18 సంవత్సరాల కూతురిని కొట్టడంతో మనస్తాపానికి గురైన వారిరువురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎలాగూ ఇన్ని రోజులు మద్యం  సేవించడం లేదు కదా, ఇక మానెయ్యొచ్చుకదా అని అడిగినందుకు భార్య, కూతురిపై చేయి చేసుకున్నాడు ఆ తాగుబోతు.  

లాక్ డౌన్ పుణ్యమాని మద్యం దొరకడం లేదు, ఇక భర్త మారుతాడు అనుకున్న ఆ మహిళ ఆశల మీద నీళ్లు చల్లుతూ... జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మద్యం షాపులను తెరిచింది. ఆ మద్యం తాగి వచ్చిన భర్త ఇలా చేయి చేసుకోవడంతో... ఇక తమ గోడు ఆ భగవంతుడికే చెప్పుకుంటామంటూ ఆ దేవుడి చెంతకే వెళ్లారు తల్లీకూతుళ్లు. 

వివరాల్లోకి వెళితే... చిత్తూరు జిల్లా పలమనేరులో చొక్కలింగం అనే వ్యక్తి ఎలక్ట్రీషియన్ గా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య సైతం టిఫిన్ బండి నడుపుతూ భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది. ఇలా సాగుతున్న వారి 38 ఏండ్ల సంసార జీవితానికి ఒక 18 ఏండ్ల పాప కూడా ఉంది. 

కానీ ఈ మద్యం మహమ్మారి ధాటికి వారు ఈ లోకంలోనే లేకుండా వెళ్లిపోయారు. నిన్న మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో... మద్యం కొనుక్కొని వచ్చాడు చొక్కలింగం. మద్యం తాగొద్దు అని ఎంత బ్రతిమిలాడినా వినలేదు ఆ వ్యక్తి. మద్యం సేవిస్తూనే వారిరువురితో వాగ్వివాదానికి దిగాడు. ఇద్దరిపై తాగిన మత్తులో చేయి చేసుకున్నాడు. ఇక ఆ తాగుబోతు మారడు అని నిశ్చయించుకున్న తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. 

సంపూర్ణ మద్యపాన నిషేధం మా లక్ష్యం అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి ఈ అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మద్యానికి పూర్తిగా చేరమగీతం పాడేసి ఉంటె బాగుండేది కదా అని వాపోతున్నాయి విపక్షాలు. 

మద్యాన్ని ఆదాయ మార్గంగా మేము చోడబోము అని చెప్పిన వైసీపీ సర్కార్ ఇప్పుడు మద్యంపై 25 శాతం రేట్లను పెంచి ఖజానాలను నింపుకోవడానికి పేదల రక్తం తాగుతుందని వారు ఆరోపిస్తున్నారు. మద్యం దుకాణాలు ఇంత అత్యవసరంగా తెరవడానికి మద్యం నిత్యావసరమయిపోయిందా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios