Asianet News TeluguAsianet News Telugu

మందుబాబులకు జగన్ సర్కార్ షాక్: ఏపీలో మద్యంపై 75 శాతం పన్ను

ఆంధ్రప్రదేశ్ లో మద్యం రేట్లను 25 శాతం మేర పెంచిన జగన్ సర్కార్ తాజాగా మరో 50 శాతం పెంచింది. ఈ పెంపుతో మొత్తం 75 శాతం పెరిగినట్టయింది. అంటే... ఇంతకుముందు 1000 రూపాయలు ఉండే మందు సీసా ఇప్పుడు 1750 రూపాయలు అవుతుందన్నమాట! 

Liquor rate increased by 75% in AP,
Author
Amaravathi, First Published May 5, 2020, 11:37 AM IST

ఆంధ్రప్రదేశ్ లో మందుబాబులకు జగన్ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. నిన్న షాపుల దగ్గర గుమికూడిన జనాలు తగ్గి, రద్దీ తగ్గినక నేడు మద్యం కొనుక్కుందాం అనుకున్న వారందరికీ ఇది షాకింగ్ అని చెప్పక తప్పదు. 

ఆంధ్రప్రదేశ్ లో మద్యం రేట్లను 25 శాతం మేర పెంచిన జగన్ సర్కార్ తాజాగా మరో 50 శాతం పెంచింది. ఈ పెంపుతో మొత్తం 75 శాతం పెరిగినట్టయింది. అంటే... ఇంతకుముందు 1000 రూపాయలు ఉండే మందు సీసా ఇప్పుడు 1750 రూపాయలు అవుతుందన్నమాట! 

నిన్నొక్కరోజే ఆంధ్రప్రదేశ్ 68 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. ఆదాయం విషయంగా అది చెప్పుకోదగ్గ విషయమైనప్పటికీ....  భౌతిక దూరమన్నదే పాటించకుండా ప్రజలలా లైన్లలో ఒకరిమీద ఒకరు పడి తోసుకోవడం మాత్రం ఈ కరోనా వైరస్ సమయంలో అస్సలు హర్షించదగ్గ విషయం కాదు. ఈ  

ప్రతిపక్షాలు కూడా ఈ విషయమై జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాయి. 

ఇకపోతే.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 67 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,717కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ మరమాల సంఖ్య 34కు చేరుకుంది. మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

గత 24 గంటల్లో 8,263 మందికి పరీక్షలు నిర్వహించగా 67 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు  నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు ఆస్పత్రుల్లో చికిత్స పొంది 589 మంది డిశ్చార్జీ కాగా, 1094 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

కర్నూలులో కరోనా వైరస్ విజృంభణ ఆగడం లేదు. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 25 కేసులు నమోదయ్యాయి. దీంతో 516 కేసులతో రాష్ట్రంలో కర్నూలు జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుంటూరు జిల్లాలో కొత్తగా 13 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో గుంటూరు జిల్లా 351 కేసులతో రెండో స్థానంలో కొనసాగుతోంది. 

ప్రకాశం, శ్రీకాకుళం, చిత్తూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గత 24 గంటల్లో కొత్త కేసులు రికార్డు కాలేదు. విజయనగరం జిల్లా ఇప్పటికీ కరోనా ఫ్రీగానే ఉంది. 

కర్నూలు జిల్లాలో పది కరోనా వైరస్ మరణాలు సంభవించగా, గుంటూరు జిల్లాలో 8 మంది మరణించారు. కృష్ణా జిల్లాలో 9 మంది మరణించారు. అనంతపురం జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో 3గురు మరణించారు.

Follow Us:
Download App:
  • android
  • ios