Asianet News TeluguAsianet News Telugu

మద్యపాన నిషేదానికి తూట్లు పొడిచిన జ‌గ‌న్ - ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి కె ఎస్. జవహర్

మద్యపాన నిషేదం చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్.. ఇప్పుడు దానిని మర్చిపోయారని మాజీ మంత్రి జవహర్ అన్నారు. ఆదివారం మీడియాకు ఓ వీడియో విడుదల చేసిన ఆయన సీఎం జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. 

Lips for alcohol ban Pierced Former Excise Minister K.S. Jawahar
Author
Amaravathi, First Published Dec 19, 2021, 4:54 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్ మ‌ద్య‌పాన నిషేదానికి తూట్లు పొడిచార‌ని ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి కె ఎస్. జవహర్ అన్నారు. ప్ర‌జ‌ల ప్రాణాల‌తో జ‌గ‌న్ సర్కార్ ఆట‌లాడుతోంద‌ని ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయ‌న మీడియాకు వీడియో విడుద‌ల చేశారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం మ‌ద్య‌పాన నిషేదానికి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ఆరోపించారు. మ‌ద్యపానం నిషేదిస్తామ‌ని అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ దానిని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అన్నారు. ధ‌ర‌లు పెంచితే తాగ‌డం త‌గ్గుతుంద‌ని చెప్పిన సీఎం ఇప్పుడు 20 శాతం ధ‌ర‌లు ఎందుకు తగ్గిస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. ఇప్పుడు మ‌ళ్లీ ద‌శ‌ల‌వారీగా మ‌ద్య నిషేదం అని మ‌రో మాట చెప్తున్నార‌ని ఎద్దేవా చేశారు. ప్ర‌భుత్వం ప్ర‌ధాన ఆదాయ వ‌నరుగా మ‌ద్యాన్ని చూస్తోంద‌ని తెలిపారు. గంటకు ప‌ది కోట్లు, రోజుకు 245 కోట్లు, నెల‌కు 7,600 కోట్లు ఎలా సంపాదించాల‌నే విష‌యాన్నే సీఎం ఆలోచిస్తున్నార‌ని ఆరోపించారు. ఆ ఆదాయం ద్వారానే ప్ర‌భుత్వాన్ని న‌డ‌పాల‌ని చూస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. అస‌లు ధ‌ర‌లు ఎందుకు పెంచారో, మ‌రి ఇప్పుడెందుకు త‌గ్గిస్తున్నారో చెప్పాల‌ని ప్ర‌శ్నించారు. త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో ఉన్న మంచి క్వాలిటీ బ్రాండ్‌లు తీసుకొస్తామ‌ని ఇప్పుడు మ‌ళ్లీ తెస్తామ‌ని సీఎం చెప్తున్నార‌ని తెలిపారు. అంటే త‌మ ప్ర‌భుత్వం బాగుంద‌ని సీఎం జ‌గ‌న్ ఒప్పుకుంటున్నార‌ని అన్నారు. మ‌ద్యం ద్వారా వ‌చ్చే ఆదాయం లేకపోతే ఏపీ స‌ర్కార్ న‌డిచే ప‌రిస్థితి లేద‌ని, అందుకే మ‌ద్య పాన నిషేదాన్ని జ‌గ‌న్ అమ‌లు చేయ‌బోర‌ని ఆరోపించారు. ఏడాదికి ఎనబై నాలుగు వేల కోట్లు రాబ‌ట్టుకోవాల‌నే ఆశే త‌ప్ప మ‌ద్య‌పానాన్ని నిషేదించాల‌ని సీఎం అనుకోవ‌డం లేద‌ని అన్నారు. 

నూజివీడులో ఘోర ప్రమాదం.. లారీ ఢీకొనడంతో తల్లీ బిడ్డల దుర్మరణం

పేద‌ల‌ను తాగేందుకు సీఎం జ‌గ‌న్ ప్రోత్స‌హిస్తున్నార‌ని ఆరోపించారు. మద్యపానం ప్రచారం చేసే క‌మిటీగా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని విమ‌ర్శించారు. ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల బలహీనతల్ని క్యాష్ చేసుకోవాల‌ని చూస్తోంద‌ని ఆరోపించారు. జ‌గ‌న్ మ‌ద్య‌పాన నిషేదం అమ‌లు చేయ‌కుండా, ఆ మ‌ద్య‌పానం ద్వారా వ‌చ్చే డ‌బ్బుతో ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని చూస్తున్నార‌ని ఆరోపించారు. ఇలా చేస్తే ప్ర‌జ‌లెవ‌రూ స‌హించ‌బోర‌ని తెలిపారు. మ‌ద్య‌పానాన్ని నిషేదించ‌డానికి ఏపీ ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని అన్నారు. ఈ విష‌యం ఆంధ్ర‌ప్ర‌దేశ్ పౌరులెవ‌రిన‌డిగినా చెప్తార‌ని అన్నారు. టీడీపీ హ‌యాంలో ఉన్న మంచి క్వాలిటీ బ్రాండ్ల మందు తీసుకొస్తాన‌ని సీఎం చెప్తున్నార‌ని, అంటే త‌మ ప్ర‌భుత్వమే మంచి పాల‌న అందించింద‌ని జ‌గ‌న్ ఒప్పుకున్న‌టే అని అర్థ‌మ‌వుతోంద‌ని అన్నారు. ప్ర‌జ‌ల బ‌ల‌హీన‌త‌ల్నిసీఎం క్యాష్ చేసుకోవాల‌ని చూస్తున్నార‌ని ఆరోపించారు. ప్ర‌జ‌లే సీఎంకు బుద్దిచెబుతార‌ని అన్నారు. పేద‌ల‌ను తాగించి ఆ డ‌బ్బుతో ప్ర‌భుత్వాన్నిన‌డ‌పాల‌నుకోవ‌డం సిగ్గుచేట‌ని అన్నారు. ఇప్ప‌టికైనా మ‌ద్యాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో నిషేదించాల‌ని డిమాండ్ చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios