తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్‌లో చిరుత సంచారం.. సీసీ కెమెరాలో దృశ్యాలు

తిరుపతి (tirupathi) నగరంలోని శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీలో (sri venkateswara university) చిరుత (leopard) కలకలం రేపింది. గురువారం అర్ధరాత్రి యూనివర్శిటీలోకి ప్రవేశించిన చిరుత.. క్యాంపస్‌లో చక్కర్లు కొట్టింది. 

leopard roaming in sri venkateswara university in tirupathi

తిరుపతి (tirupathi) నగరంలోని శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీలో (sri venkateswara university) చిరుత (leopard) కలకలం రేపింది. గురువారం అర్ధరాత్రి యూనివర్శిటీలోకి ప్రవేశించిన చిరుత.. క్యాంపస్‌లో చక్కర్లు కొట్టింది. వెటర్నరీ కాలేజీ ఉమెన్స్ కాలేజీ (veterinary womens college) మహిళల వసతి గృహం దగ్గర చిరుత ఎక్కువ సేపు తచ్చాడింది. రోడ్లపై, చెట్ల మధ్యన తిరిగింది. చిరుత సంచారానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. చిరుత తిరిగిందనే వార్తలతో యూనివర్శిటీలోని విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కొన్ని రోజులుగా రాత్రి పూట చిరుత తిరుగుతోందని వారు అంటున్నారు. చీకటి పడిన తర్వాత చిరుత క్యాంపస్ లోకి వస్తోందని... దీంతో రాత్రి పూట బయటకు రాలేకపోతున్నామని చెపుతున్నారు. చిరుతను పట్టుకోవాలని యూనివర్శిటీ విద్యార్థులు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

కాగా, రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలో (nirmal district) చిరుత (leopard) సంచారం భయాందోళన కలిగిస్తోంది. కడెం ప్రాజెక్ట్ (kadem project) ఎడమ కాలువ సమీపంలో గొర్రెల మందపై దాడి చేసింది చిరుత. ఒక గొర్రెను చంపేసి అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. ఆ దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు (forest department) పులిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ALso Read:నిర్మల్‌ జిల్లాలో చిరుత పులి సంచారం.. బిక్కుబిక్కుమంటున్న గ్రామాలు

ఈ మధ్య కాలంలో రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో చిరుత పులులు సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అడవుల్లో ఉండాల్సిన పులులు గ్రామాల్లోకి రావడం, పశువులను చంపుతుండటంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. కొద్దినెలల క్రితం ఇదే నిర్మల్‌ జిల్లా కుభీర్ మండలం జాంగాం గ్రామ శివారులో చిరుత పులి సంచరించడం కలకలం రేపుతోంది. పంట పొలాల సమీపంలో అడవి పందిపై చిరు దాడి చేసింది. దీంతో పరిసరాల్లో ఉన్న పశువుల కాపర్లు, వ్యవసాయ కూలీలు భయంతో పరుగులు తీశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios