తిరుపతి:తిరుపతి పట్టణంలో చిరుతపులి కలకలం సృష్టించింది. బైక్ పై వెళ్తున్న యువకుడిపై దాడి చేసింది. ఈ దాడి నుండి ఆయన తృటిలో తప్పించుకొన్నాడు.  ప్రాణాపాయం నుండి ఆ యువకుడు తప్పించుకొన్నాడు.

బుధవారం నాడు అర్ధరాత్రి తిరుపతిలోని జీవకణ వీధిలోకి చిరుత వచ్చింది. ఈ వీధిలోని కుక్కపై చిరుతపులి దాడి చేసింది.  కుక్క పెద్దగా అరవడంతో అదే వీధిలో నిద్రపోతున్న నాగరాజు కుక్క అరుపుతో లేచాడు.   కుక్కను నోట కరుచుకొని గోడ దూకి చిరుతపులి  పారిపోయేందుకు ప్రయత్నించింది. అయితే గోడ దూకే క్రమంలో చిరుతపులి కుక్కను వదిలేసింది. దీంతో కుక్క తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకొంది.

ఈ దృశ్యాలను కళ్లారా చూసిన నాగరాజు అనే యువకుడు ఇంట్లోకి వెళ్లి భయంతో తలుపులు వేసుకొంది.  గురువారం నాడు ఉదయం జూపార్క్ వద్ద బైక్ ను చిరుతపులి వెంటాడింది.  బైక్ పై వెళ్లే యువకుడిపై పంజా విసిరింది. చిరుత దాడిలో ఆ యువకుడి కాలుపై గాయాలయ్యాయి. ప్యాంట్ చిరిగిపోయింది. 

చిరుత దాడిలో గాయపడిన యువకుడు కరోనా పరీక్షలు చేయించుకొన్నాడు. కానీ,  ఫలితాలు రాలేదు. మరోవైపు ఈ యువకుడి తల్లీదండ్రులకు కరోనా సోకింది. దీంతో ఈ యువకుడు కూడ కరోనా పరీక్షలు చేయించుకొన్నాడు. ఈ యువకుడికి కరోనా ఉంటే... యువకుడిపై దాడి చేసిన పులికి కరోనా సోకే అవకాశం ఉందా.. అదే జరిగితే అడవిలోని ఇతర జంతువులకు కూడ చిరుత ద్వారా కరోనా సోకే అవకాశం ఉంటుందా అనే చర్చ కూడ సాగుతోంది. యువకుడిపై దాడి చేసిన చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు

తిరుమల ఘాటు రోడ్డులో కూడ చిరుత సంచారం కలకలం రేపింది.  రోడ్డుపై వెళ్తున్న వారిపై దాడికి ప్రయత్నించింది.  బైక్ పై వెళ్తున్నవారు తప్పించుకొని టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ఆధారంగా విజిలెన్స్ అధికారులు అప్పట్లో చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.