Asianet News TeluguAsianet News Telugu

రఘురామ అరెస్ట్‌: మరికాసేపట్లో హౌస్‌‌మోషన్..?

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్‌పై ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. రఘురామకృష్ణంరాజు అరెస్ట్ నిబంధనల ప్రకారం జరగలేదని పిటిషన్ వేయనున్నారు. పోలీసులు నిర్బంధించి తీసుకెళ్లిన ఎంపీకి అనారోగ్య సమస్యలు వున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

lawyers ready to file house motion petition on ysrcp mp raghurama krishnam raju arrest ksp
Author
Amaravathi, First Published May 14, 2021, 7:28 PM IST

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్‌పై ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. రఘురామకృష్ణంరాజు అరెస్ట్ నిబంధనల ప్రకారం జరగలేదని పిటిషన్ వేయనున్నారు. పోలీసులు నిర్బంధించి తీసుకెళ్లిన ఎంపీకి అనారోగ్య సమస్యలు వున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

కాగా, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజును శుక్రవారం ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కల్గించేలా వ్యాఖ్యలు చేసినందుకుగాను 124 ఐపీసీ-ఏ సెక్షన్ కింద ఆయనపై కేసు నమోదు చేశారు. ఈమేరకు హైద్రాబాద్‌లోని రఘురామకృష్ణంరాజు ఇంట్లో సీఐడీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. హైద్రాబాద్ నుండి ఎంపీని ఆంధ్రప్రదేశ్ తరలిస్తున్నారు. 

Also Read;వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్

అంతకుముందు సీఐడీ పోలీసులతో రఘురామకృష్ణమ రాజు వాగ్వివాదానికి దిగారు. సెక్యూరిటీ సిబ్బంది రఘురామ కృష్ణమ రాజు చుట్టూ వలయంగా ఏర్పడి అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ పై అధికారుల ఆదేశాలు వచ్చేవరకు అరెస్టు చేయడానికి అనుమతించబోమని వారు చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios