వచ్చే నెలలో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. రాజకీయ నాయకుల భవిష్యత్తు ప్రజలు వేసే ఓటుపైనే ఆధారపడి ఉంది. అయితే.. ఇప్పటి వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోని వారు.. కొత్త ఓటర్లు, ఓటు గల్లంతైన వారికి ఇది ఆఖరి అవకాశం. రేపు సాయంత్రం లోగా.. ఓటు లేని వారు ఓటు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఎన్నికల ప్రధాన అధికారి గోపాల్ కృష్ణ ద్వివేది తెలిపారు.

ఓటు ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత ఓటరుపైనే ఉందన్నారు. ఎలాంటి ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు. అనేక మాధ్యమాల ద్వారా ఓటరు నమోదు, తనిఖీకి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఈ స్థాయిలో ఓట్లు పెరిగేందుకు ప్రజలతో పాటు అన్ని వర్గాల కృషి ఉందని వ్యాఖ్యానించారు. ఓటు నమోదు కోసం ఆన్‌లైన్‌లో సర్వర్‌ డౌన్‌ అయితే ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తులు చేయవచ్చునని సూచించారు. బూత్‌ లెవెల్‌ అధికారి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకూ దరఖాస్తు ఫారంలను నేరుగా సమర్పించవచ్చని తెలిపారు. ఏపీ ఓటర్ల నమోదులో వెనకబడి ఉందన్న వాదనలు సరికాదని  అన్నారు. 

ఓటర్ల నమోదులో ఏపీ అన్ని రాష్ట్రాలతో సమాన స్థాయిలోనే ఉందని చెప్పారు. 7 నుంచి 9 శాతం వరకూ ఓటర్లు పెరిగే అవకాశముందని వ్యాక్యానించారు. 3.95 కోట్లకు ఓటర్ల సంఖ్య రాష్ట్రంలో చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని అన్నారు. జనవరి 11కు ముందు 20 లక్షల కొత్త ఓట్లు జాబితా చేర్చామని తెలిపారు. ఈ నెల 25వ తేదీ తర్వాత విడుదల చేయనున్న అనుబంధ ఓటర్ల జాబితా తర్వాత మరో 20 లక్షలకు పైగా ఓట్లు పెరిగే అవకాశముందని పేర్కొన్నారు.