Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు కంటతడి... ఇంకా మీ బావనే నమ్ముతున్నారా : నందమూరి ఫ్యామిలీపై లక్ష్మీపార్వతి ఫైర్

ఎన్టీఆర్ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారని .. తెలుగు జాతి అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన పేరేనని లక్ష్మీపార్వతి అన్నారు. ఎన్టీఆర్ కడుపున పుట్టి ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారంటూ నందమూరి వారసులపై ఆమె ఫైరయ్యారు.

laskshmi parvathy slams nandamuri family over supporting chandrababu
Author
Hyderabad, First Published Nov 20, 2021, 5:00 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఏపీ అసెంబ్లీలో (ap assembly) శుక్రవారం జరిగిన పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. తన సతీమణితో పాటు తన కుటుంబసభ్యులపై వైసీపీ (ysrcp) నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) మీడియా సమావేశంలో బోరున విలపించారు. దీనిపై శనివారం నందమూరి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ (ntr) సతీమణి, వైసీపీ నేత నందమూరి లక్ష్మీపార్వతి (laskshmi parvathy) మీడియా ముందుకు వచ్చారు.

ఎన్టీఆర్ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారని .. తెలుగు జాతి అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన పేరేనని లక్ష్మీపార్వతి అన్నారు. ఎన్టీఆర్ కడుపున పుట్టి ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారంటూ నందమూరి వారసులపై ఆమె ఫైరయ్యారు. ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత చంద్రబాబు తనకు ఫోన్ చేసి ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తానని, మీ అబ్బాయిని విదేశాల్లో చదివించుకుని అక్కడే సెటిలవ్వాలని ఆఫర్ చేసినట్లు లక్ష్మీపార్వతి ఆరోపించారు. ఈ విషయాన్ని ఒక్కసారి చంద్రబాబును అడగాలని బాలయ్యను కోరారు. దీనిపై బాబు ఒక్క నిజం కూడా చెప్పారని లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. నందమూరి కుటుంబసభ్యులకు నాపై లేనిపోనివి చెప్పి.. తనపై ద్వేషాన్ని తెచ్చారని ఆమె ఆరోపించారు. 

తనను ఒక్కసారైనా దీని గురించి అడిగి వుంటే తాను అంతా చెప్పేదాన్నని లక్ష్మీపార్వతి అన్నారు. వైశ్రాయ్ ఘటన తర్వాత బాలయ్య తన వద్దకు వచ్చారని.. ఆనాడే తనకు ఎలాంటి పదవి అక్కర్లేదని, ఏ పదవి తాను తీసుకోలేదని, రెండు సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినా వద్దన్నానని లక్ష్మీపార్వతి గుర్తుచేశారు. ఎన్టీఆర్  ప్రధాని కాకుండా చంద్రబాబు అడ్డుపడ్డారని.. కుటుంబసభ్యులు చెప్పిన మాటలకు బాలయ్య మారిపోయారని ఆమె అన్నారు. వెన్నుపోటు సమయంలో కోర్టులు, మీడియాను చంద్రబాబు ఎలా మేనేజ్ చేసింది అందరికీ తెలుసునని లక్ష్మీపార్వతి చెప్పారు. స్వయంగా ఎన్టీఆర్ ఒక క్యాసెట్ తయారు చేయించి అల్లుడు తనను ఎలా మోసం చేసింది, ఎలా ఇబ్బంది పెట్టిందని చెప్పారని ఆమె గుర్తుచేశారు. 

ALso Read:Nandamuri Balakrishna: చేతులు ముడుచుకుని కూర్చోం.. బద్దలు కొట్టుకుని వస్తాం.. బాలకృష్ణ వార్నింగ్

ఏ బిడ్డలైనా తండ్రికి అవమానం జరిగితే .. ఆయన పక్కన నిలబడతారని లక్ష్మీపార్వతి అన్నారు. మీ నాన్నని కాదని.. బావ పక్కన నిలబడతారా అంటూ ఆమె నందమూరి కుటుంబీకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఇంటిలోంచి గెంటేసినా, చేతిలో డబ్బులు లేకపోయినా ఎన్టీఆర్ టీడీపీని (ntr tdp) నడిపానని లక్ష్మీ పార్వతి గుర్తుచేశారు. కేవలం చంద్రబాబుపై పోరాడటానికే తాను వైసీపీలోకి వచ్చానని, తాను పదవుల కోసం రాలేదని ఆమె స్పష్టం చేశారు. 

ఎన్టీఆర్‌తో తనకు నాలుగేళ్ల అనుబంధమే వుందని.. దానికే తాను జీవితాన్ని త్యాగం చేశానని, కానీ మీరేం చేశారని ఇంకా ఆ దుర్మార్గుడిని నమ్ముతున్నారంటూ లక్ష్మీపార్వతి మండిపడ్డారు. అసెంబ్లీలో ఏం జరిగిందో నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించారా అని ఆమె ప్రశ్నించారు. వైసీపీ నేతలు చంద్రబాబును ఆయన పార్టీ నేతలను తిట్టారు తప్పించి.. ఏనాడూ ఆడవాళ్ల జోలికి రాలేదని లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు. బాలకృష్ణకు చెందిన భవనంలోనే వైఎస్ షర్మిలపై (ys sharmila) అసభ్యకర పదజాలంతో దూషించారని ఆమె ఆరోపించారు. వైఎస్ జగన్‌ను (ys jagan) జైలుకు పంపింది చంద్రబాబు కాదా అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios