విజయవాడ: తెలుగుదేశం పార్టీ నేత లంకల దీపక్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాను 25 ఏళ్లుగా పార్టీ క్రియాశీలక సభ్యుడిగా ఉన్నట్లు ఆయన తెలిపారు. తాను పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూ వచ్చానని ఆయన చెప్పారు. 

ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే బాధాకరంగా ఉన్నాయని లంకల దీపక్ రెడ్డి అన్నారు. పార్టీకి వెన్నంటి ఉండి మద్దతు తెలిపినప్పటికీ తనకు ఎక్కడా స్థానం కల్పించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు 

టీడీపీ అధినేత చంద్రబాబుని తప్పు దోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. తన అభిమానుల కోరిక మేరకు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు.