విశాఖపట్నం: మావోయిస్టుల ఏరివేత కోసం ఏవోబీలో కుంబింగ్ నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ ధళాలకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ కూంబింగ్ దళాలే లక్ష్యంగా మావోయిస్టులు బాంబులు అమర్చారు. అయితే బీఎస్ఎఫ్ బలగాలు ఈ బాంబులను ముందుగానే గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. ఐదు కిలోల బాంబును వెలికితీసి పేల్చివేసిన బిఎస్ఎఫ్ దళాలు మరికొన్ని ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.  

గతేడాది చివర్లో చత్తీస్ ఘడ్ సుక్మా జిల్లాలోని భుర్కపాల్ అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సిఆర్ఫిఎఫ్ బృందాలపై ఐఈడీ బ్లాస్ట్ లతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ దాడిలో ఎనిమిది మంది సిఆర్పిఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఓ  సీఆర్పీఎఫ్ అధికారి మృతి చెందారు. గాయపడిన జవాన్లందరిని మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక విమానంలో రాయ్ పూర్ కు తరలించి చికిత్స అందించారు.  

ఇదే తరహాలో కూంబింగ్ చేపట్టే బలగాలను లక్యంగా చేసుకుని మావోయిస్టులు బాంబులను అమర్చారు. అయితే ఈ బాంబులను గుర్తించడంతో ప్రమాదం తప్పింది. లేదంటే మరోసారి బీఎస్ఎఫ్ ధళ సభ్యుల ప్రాణాలను ముప్పు ఏర్పడేది.