తిరుమల ఘాట్ మూసివేత.. తృటిలో తప్పిన పెను ప్రమాదం, భారీ ట్రాఫిక్ జాం (వీడియో)
తిరుమల రెండో కనుమదారిలో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. కొండ పైనుంచి రహదారిపై భారీ బండరాయి పడింది. దీంతో రహదారి మూడు చోట్ల పాక్షికంగా ధ్వంసమైంది. వెంటనే స్పందించిన టీటీడీ ముందు జాగ్రత్త చర్యగా ఈ మార్గంలో కొండపైకి వెళ్లే వాహనాలను తాత్కాలికంగా నిలిపేసింది.
తిరుమల రెండో కనుమదారిలో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. కొండ పైనుంచి రహదారిపై భారీ బండరాయి పడింది. దీంతో రహదారి మూడు చోట్ల పాక్షికంగా ధ్వంసమైంది. వెంటనే స్పందించిన టీటీడీ ముందు జాగ్రత్త చర్యగా ఈ మార్గంలో కొండపైకి వెళ్లే వాహనాలను తాత్కాలికంగా నిలిపేసింది. దీనికి ప్రత్యామ్నాయంగా లింక్ రోడ్డు నుంచి విడతల వారీగా కొండ మీదకి పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే కొండ పై నుంచి దిగువకు వచ్చే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేవని టీటీడీ వర్గాలు తెలిపాయి.
కాగా.. కొద్దిరోజుల క్రితం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని కొండపైకి రాకపోకలు సాగించే రెండు ఘాట్ రోడ్లను మూసివేస్తూ TTD నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. tirumala కొండపైకి కాలినడకన వెళ్లే అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాలను నవంబరు 17, 18 తేదీల్లో మూసివేసింది. తర్వాత తిరిగి రాకపోకలను పునరుద్ధరించింది.
Also Read:ఏపీలో సోమ, మంగళవారాల్లో అతి భారీ వర్షాలు... ఆ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక, స్కూళ్లకు సెలవు
మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ ను వర్షాలు వదిలిపెట్టడం లేదు. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మళ్ళీ రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో heavy to extreme heavy rains కురిసే అవకాశాలున్నాయంటూ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో చిత్తూరు, కడప జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. గుంటూరు, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. floods ముప్పు పొంచివున్న జిల్లాల అధికారులతో ఇప్పటికే cm ys jagan మాట్లాడి తగు సూచనలు చేసారు.
ఇక ఇప్పటికే kadapa district కోడూరు, చిట్వేల్ మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనుంపల్లి వద్ద వాగులు పొంగిపొర్లుతుండటంతో చిట్వేలి, రాపూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జమ్మలమడుగులో ఓ మోస్తరు వర్షం కురిసింది. రాయచోటిలో ఉదయం నంచి భారీ వర్షం కురుస్తోంది. anantapur district లోని పుట్టపర్తి, తాడిపత్రిలోనూ వర్షతీవ్రత ఎక్కువగా వుంది. ప్రకాశం జిల్లా కంభం, బెస్తవారిపేట, అర్ధవీడులో వర్షాలు కురుస్తున్నాయి. చీరాలలో చిరుజల్లులు కురిసాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. పలు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనంతసాగరం ఎస్సీ కాలనీలోకి వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
"