ఓ లేడీ సబ్ ఇన్ స్పెక్టర్ మానవత్వాన్ని చాటుకున్నారు. గుర్తు తెలియని అనాథ శవాన్ని స్వయంగా భుజాలపై మోస్తూ మూడు కిలోమీటర్ల మేర నడిచి వెళ్లారు. దీంతో ఆమె మీద ప్రశంసల జల్లు కురుస్తోంది. 

హనుమంతునిపాడు : విధి నిర్వహణలో భాగంగా తోటి సిబ్బంది సాయంతో ఓ woman police గుర్తు తెలియని dead bodyనr ఎర్రటి ఎండలో మూడు కిలోమీటర్ల మేర మోసుకువచ్చి రహదారిపైకి తీసుకువచ్చింది. ఆ తర్వాత Postmortem కోసం తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలంలో సోమవారం చోటు చేసుకుంది. Hajipuram Revenue Forest లో సుమారు 60 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని శవం కుళ్లిపోయిన స్థితిలో ఉందని వీఆర్వో జాన్సన్ రాజు సమాచారం అందించారు.

దీంతో వెంటనే ఎస్ఐ కృష్ణపాపని, సిఐ పాపారావు తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే మృతదేహం కుళ్లిపోయి గుర్తించడానికి వీలు లేకుండా ఉంది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తరలించాలన్నా.. రహదారిపై తుప్పలు పెరిగి వాహనం వెళ్లలేని పరిస్థితి దీంతో కానిస్టేబుల్ సాయంతో ఎస్సై కృష్ణపావని.. మృతదేహాన్ని ఓ కర్రకు కట్టి మూడు కిలోమీటర్ల దూరం మోసుకొచ్చారు. అక్కడి నుంచి కనిగిరి ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లోవైరల్ అయ్యింది. 

నిరుడు, ఫిబ్రవరిలో ఇలాంటి ఘటనే శ్రీకాకుళంలో చోటు చేసుకుంది. గుర్తు తెలియని మృతదేహాన్ని భుజాలపై మోసుకుంటూ 2 కిమీ నడిచి గమ్యానికి చేర్చారు. పలాస పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న శిరీష మానవత్వాన్ని చాటుకున్నారు. ఇలా శిరీష చేసిన పనికి, ఆమె దయార్ధ్ర హృదయానికి పలాస ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. విధి నిర్వహణలోనే కాదు సేవ కార్యక్రమంలో వెనుకడుగు వేయని పోలీస్ గా శిరీష గుర్తింపు పొందారు. 

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే నిరుడు జనవరిలో పూనేలో జరిగింది. ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్ రోడ్డు ఊడుస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూనె, తిలక్ రోడ్ లో ఓ యాక్సిడెంట్ జరిగింది. బైక్ అద్దాలు, ప్లాసిక్ ముక్కలతో ఆ ప్రాంతం నిండిపోయింది. ఆ రోడ్డులో ప్రయాణించే మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలగొద్దని ఆ మహిళా కానిస్టేబుల్ స్వయంగా చీపురు పట్టి రోడ్డు ఊడ్చేసింది.

గాజుపెంకులు, ప్లాస్టిక్ ముక్కలు ఎత్తేసి వాహనదారులకు మార్గం సుగమం చేసింది. ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ అమల్దార్ రజియా సయ్యద్ చేసిన ఈ పనిని ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. స్వీపర్స్ వచ్చేదాకా వేచి చూడకుండా స్వయంగా శుభ్రం చేయడానికి పూనుకుందంటూ ఆమెకు ప్రశంసల వర్షం కురుస్తోంది. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ కూడా ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. 

"వాహనదారులకు అసౌకర్యం కలగకుండామహిళా పోలీసులు అమల్దార్ రజియా సయ్యద్ చొరవ తీసుకున్నారు యాక్సిడెంట్ వల్ల రోడ్డు మీద పడ్డ గాజుపెంకులు, ప్లాస్టిక్ ముక్కలను ఆమె చీపురుతో శుభ్రం చేశారు. పౌరుల భద్రత కోసం ఆమె చేసిన పని ఆదర్శప్రాయమైనది" అంటూ దేశ్ ముఖ్ ప్రశంసించారు. అంతేకాదు ఈ వీడియోను @PuneCityPolice, @CPPuneCity లకు ట్యాగ్ చేశాడు. పౌరుల భద్రత కోసం రహదారిని శుభ్రం చేసి ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె చొరవకు మెచ్చుకున్న నగర పోలీసులు సయ్యద్‌ను ఖాదక్ ట్రాఫిక్ విభాగంలోకి పోస్ట్ చేశారు.