Asianet News TeluguAsianet News Telugu

వీళ్ల దుంపతెగా ఇదేం చోరీ.. వినాయకుడి చేతిలో లడ్డూ దొంగతనం.. సీసీ టీవీలో నిక్షిప్తం..

కర్నూలులో వింత దొంగలు హల్ చల్ చేశారు. అర్థరాత్రి గుట్టు చప్పుడు కాకుండా వినాయకమండపంలోకి చొరబడి.. లడ్డూ ఎత్తుకెళ్లారు. 

Laddu theft from Vinayaka mandapam in kurnool
Author
First Published Sep 3, 2022, 12:47 PM IST

కర్నూలు : ఢిల్లీ నుంచి గల్లీ వరకు దేశవ్యాప్తంగా కొలువుదీరిన మండపాల్లో వినాయకుడు ఘనంగా పూజలందుకుంటున్నాడు. వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వినాయక విగ్రహానికి ఎంత ప్రాధాన్యత ఉందో.. ఆయన చేతిలో లడ్డూ ప్రసాదానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. గణపతితో పాటు.. ఆయన చేతిలో పెట్టే లడ్డు కూడా నవరాత్రులు పూజలు అందుకుంటుంది. ఆ లడ్డునూ నవరాత్రుల చివరి రోజు వేలం వేస్తారు. ఈ లడ్డూను దక్కించుకున్నవారిని అదృష్టవంతులుగా భావిస్తారు. అయితే, దొంగలు ఈ లడ్డూను కూడా వదిలిపెట్టడం లేదు.

తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లా గణేష్ మండపంలో దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. ఏకంగా వినాయకుడి చేతిలోని లడ్డూ ఎత్తుకెళ్లారు. నంద్యాల టూటౌన్ సమీపంలో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో ఈ ఘటన జరిగింది. ఈ మండపంలో భారీ గణపతి ప్రతిమను ప్రతిష్టించారు. వినాయకచవితి రోజునుంచి ఈ విగ్రమానికి భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహిస్తున్నారు. పూజలో భాగంగా వినాయకుడి చేతిలో లడ్డూ ప్రసాదం కూడా పెట్టారు. అంతేకాదు, పూజల అనంతరం ఈ లడ్డూను వేలం పాటలు దక్కించుకోవడానికి అనేక మంది పోటీ పడుతున్నారు.

న్యాయం కావాలి.. మంత్రి విడుదల రజని కార్యాలయం ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

లడ్డూను దక్కించుకున్న కుటుంబానికి సిరిసంపదలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసిస్తారు. ఈ నేపథ్యంలో గతరాత్రి విచిత్ర ఘటన జరిగింది.  వినాయకుడి చేతిలో ఉంచిన లడ్డును ఓ దొంగ ఎత్తుకెళ్లాడు. ఇదంతా అక్కడి సీసీ టీవీ కెమెరాల్లో నమోదయ్యింది. ఉదయం మండపానికి వచ్చిన వారు గమనిస్తే లడ్డూ లేకపోవడంతో సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా విషయం బయటపడింది. 

ఈ ఫుటేజ్ ప్రకారం ఇద్దరు యువకులు అర్ధరాత్రి బైక్ మీద మండపం దగ్గరికి వచ్చారు. వారిలో ఒక యువకుడు గణపతి మండపంలోకి చొరబడి.. వినాయకుడి చేతిలోని లడ్డూ తీసుకున్నాడు. ఆ తరువాత వెనక్కి వచ్చి బండిమీద ఇద్దరూ కలిసి వెళ్లిపోయారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇలాంటి దొంగతనం ఇదే మొదటిసారి కావడంతో స్థానికులు ఆశ్యర్యాసక్తులు కనబరుస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios