ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. నగరంలో కోవిడ్ 19 కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఆయన తెలిపారు.

సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది వల్ల కరోనా వైరస్ ను నియంత్రించడంలో విజయం సాధించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.

ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ కరోనా వైరస్ ను తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల ఇబ్బందులు తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్ నాలుగు విడతలుగా బియ్యం పంపిణీ చేపట్టారని హఫీజ్ ఖాన్ గుర్తుచేశారు.

తాము కూడా మన కర్నూలు మన భాధ్యత పేరు తో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. కర్నూలు ప్రజల కోసం తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు లక్షల రూపాయల విలువ చేసే బియ్యం, కంది ఆయన అందించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకున్నవారికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.