కర్నూల్ జిల్లా కలెక్టర్ వీరపాండియన్‌కి కరోనా సోకింది. దీంతో ఆయన హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. రెండు మూడు రోజులుగా అనారోగ్య లక్షణాలు కన్పించడంతో వీరపాండియన్ కరోనా పరీక్షలు చేయించుకొన్నారు. ఈ పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయింది.
కర్నూల్: కర్నూల్ జిల్లా కలెక్టర్ వీరపాండియన్‌కి కరోనా సోకింది. దీంతో ఆయన హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. రెండు మూడు రోజులుగా అనారోగ్య లక్షణాలు కన్పించడంతో వీరపాండియన్ కరోనా పరీక్షలు చేయించుకొన్నారు. ఈ పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయింది.
కరోనా నిర్ధారణ కావడంతో హోంక్వారంటైన్‌కే కలెక్టర్ పరిమితమయ్యారు. ఇటీవల కాలం్లో తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. అంతేకాదు హోం ఐసోలేషన్ లో కూడ ఉండాలని ఆయన కోరారు. ఇంటినుండే ఆయన విధులు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 18 గంటల పాటు ఆంక్షలను రాష్ట్రంలో అమలు చేస్తోంది. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే నిత్యావసర సరుకుల కొనుగోలు ఇతర అవసరాల కోసం ప్రజలను రోడ్లపైకి అనుమతిస్తోంది ప్రభుత్వం.
