ఆంధ్ర ప్రదేశ్ లోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొండపి ఒకటి. ఇక్కడినుండి ప్రస్తుతం డోలా బాల వీరాంజనేయస్వామి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కొండపిలో టిడిపిదే విజయం. దీంతో ఈసారి ఎలాగైనా ఇక్కడ జెండా ఎగరేయాలని చూస్తున్న వైసిపి మంత్రి ఆదిమూలపు సురేష్ ను బరిలోకి దింపింది. దీంతో కొండపి ఓటర్ల తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
కొండపి రాజకీయాలు :
టిడిపి ఆవిర్భావం నుండి ఇప్పటివరకు కొండపి నియోజకవర్గంలో ఐదుసార్లు విజయం సాధించింది. గత రెండు (2014,2019) అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి డోలా బాల వీరాంజనేయస్వామ విజయం సాధిస్తూ వస్తున్నారు. దీంతో ముచ్చటగా మూడోసారి అతడినే కొండపి నుండి పోటీ చేయిస్తోంది టిడిపి. అంతకుముందు 1983లో మారుబోయిన మాలకొండయ్య, 1994, 1999 లో దామచర్ల ఆంజనేయులు టిడిపి నుండి పోటీచేసి గెలిచారు.
ఇప్పటివరకు కొండపిలో వైసిపి ఖాతా తెరవలేదు. దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో వైసిపి వుంది. అందుకోసమే యర్రగొండపాలెం నుండి కొండపికి మంత్రి ఆదిమూలపు సురేష్ ను షిప్ట్ చేసారు.
కొండపి నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
1. సింగరాయకొండ
2. టంగుటూరు
3. కొండపి
4. జరుగుమిల్లి
5. పొన్నలూరు
6. మర్రిపూడి
కొండపి అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,31,653
పురుషులు - 1,15,037
మహిళలు - 1,16,613
కొండపి అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
వైసిపి అభ్యర్థి :
వైసిపి ఇప్పటివరకు కొండపిలో గెలిచింది లేదు. దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతె వున్న వైసిపి మంత్రి ఆదిమూలపు సురేష్ ను పోటీలో నిలిపింది.
టిడిపి అభ్యర్థి :
గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కొండపిలో టిడిపిదే విజయం. ఇక్కడినుండి డోలా బాల వీరాంజనేయస్వామి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి కూడా ఆయననే పోటీలో నిలిపింది టిడిపి.
కొండపి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :
కొండపి అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 2,01,678 (87 శాతం)
టిడిపి - డోలా బాల వీరాంజనేయస్వామి - 98,142 ఓట్లు (48 శాతం) - 1,024 ఓట్ల మెజారిటీతో విజయం
వైసిపి- మాదాసి వెంకయ్య - 96,718 ఓట్లు (47 శాతం) - ఓటమి
కొండపి అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,83,225 (85 శాతం)
టిడిపి - డోలా బాల వీరాంజనేయస్వామి - 91,230 (50 శాతం) - 5,440 ఓట్ల మెజారిటీతో విజయం
వైసిపి - జూపూడి ప్రభాకరరావు - 86,794 (47 శాతం) ఓటమి
