కరోనాతో సహజీవనం చేయాలంటున్నాడు దద్దమ్మ ముఖ్యమంత్రి : కొల్లు రవీంద్ర

ముఖ్యమంత్రి చేతకానితనంవల్లే రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. 

kollu ravindra sensational comments on cm ys jagan

అమరావతి: కరోనా నివారణలో ఏపీ ప్రభుత్వ చేతకానితనం కళ్లకు కట్టినట్టు కనపడుతోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. పాలకుల అసమర్థత వల్ల   కరోనా ఏపీలో విజృంభిస్తోందని... వైసీపీ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు.  కరోనా జ్వరం లాంటిది, దానితోనే మనం జీవనం సాగించాలని బాధ్యతగల ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా? ప్రపంచమంతా కరోనాతో వణుకుతుంటే కరోనాతో సహజీవనం చేయాలని మాట్లాడ్డమేంటి? అని రవీంద్ర మండిపడ్డారు.

''ముసలోడు విజయసాయి రెడ్డి వల్ల ఒక్క కేసూ లేని శ్రీకాకుళం జిల్లాలో వైరస్ వ్యాపించేసింది. ఇష్టమొచ్చినట్టు రాష్ట్రమంతా తిరుగుతున్నాడు. తెలంగాణ వెళ్ళొచ్చాడు. వారిని కట్టడి చేసే బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? కరోనా కట్టడికి చర్యలు తీసుకోకుండా చంద్రబాబుపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు'' అని విజయసాయి రెడ్డిపై విరుచుకుపడ్డారు. 

''ఏపీకి ఓ దద్దమ్మ ముఖ్యమంత్రి అయ్యాడు. కరోనా లేదని చెబుతున్న ముఖ్యమంత్రి ఇంటి నుంచి బయటకు ఎందుకు రావడం లేదు? కర్నూలులో ఉద్యోగులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా?  కరోనా టెస్టుల్లో  ఏపీ ముందుందని ముఖ్యమంత్రి చెబుతున్నారు. మరణాలు , కరోనా ఉధృతిలోనూ మనం ముందున్నామన్న విషయం ముఖ్యమంత్రికి గుర్తులేదా?'' అని ఎద్దేవా చేశారు. 

''రాష్ట్రంలో 12 జిల్లాలు రెడ్ జోన్ లో ఉన్నాయంటే అందుకు మీ అసమర్థ పాలనే కారణం. రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో మంత్రులు మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఇస్తున్న సలహాలు తీసుకోకుండా విమర్శలు చేస్తున్నారు. వైసీపీ మంత్రులు మనుషులా పశువులా ? చంద్రబాబుపై దాడులు చేయడమే కానీ ప్రజా సమస్యలు పట్టవా మీకు? వైసీపీ మంత్రులు బజారు రౌడీల్లా మాట్లాడుతున్నారు'' అని మండిపడ్డారు. 

''ఏపీలో కరోనా కేసులు పెరగడానికి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల నిర్వాకమే కారణం. ఎమ్మెల్యేల ఊరేగింపులు, ఆర్భాటాల వల్లే కర్నూలు జిల్లాలో కరోనా పెరిగింది. వైసీపీ ఎమ్మెల్యే ఇచ్చిన విందు కారణంగానే గుంటూరు జిల్లాలో కేసులు పెరిగిపోయాయి. కృష్ణా జిల్లాలో కేసుల పెరగడానికి  పాలకులే కారణం. వాస్తవ విషయాలు బయట పెట్టడం లేదు. ముఖ్యమంత్రి, మంత్రులు అధికారుల మీద ఒత్తిడి చేసి వాస్తవాలు తొక్కిపెడుతున్నారు'' అని ఆరోపించారు. 

''ఎక్కడ చూసినా క్వారంటైన్, ఐసోలేషన్ లో ఉన్నవారి సంఖ్య బయట పెట్టరు. విశాఖలో ఎంతమంది క్వారంటైన్ లో ఉన్నారో చెప్పాలి. ఐసోలేషన్ లో పెట్టిన వారి రిపోర్టులు ఎందుకు బయట పెట్టడం లేదు. 14వందల కేసుల వివరాలు బయట పెట్టాలి. నిజాన్ని ఎన్నాళ్లో దాయలేరన్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు పెట్టుకోవాలి'' అని హెచ్చరించారు. 

''చంద్రబాబుపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు.  కాకినాడలో 200 తాటిచెట్లను నరికేస్తే మంత్రి అనిల్ నోరు మెదపరేం?  అనేక రాష్ట్రాల్లో ఇరుక్కుపోయిన మత్స్యకారుల గురించి మాట్లాడరేం? పాడి పరిశ్రమను పట్టించుకోవడం లేదు. బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా మాట్లాడాలి కానీ   నోరుంది కదా అని చంద్రబాబుపై విమర్శలు చేయడమేంటి?  మాకూ నోరుంది..మీకంటే ఎక్కువ మాట్లాడగలం. కానీ మాకు సంస్కారం అడ్డొస్తోంది'' అని అన్నారు. 

''ప్రభుత్వానికి చంద్రబాబు లేఖలు రాస్తే శ్రీకాంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. సాక్షాత్తు ప్రధానే ప్రతిపక్షాల సలహాలు తీసుకుంటుంటే వైసీపీ ప్రభుత్వం మాత్రం సంక్షోభాలను పరిష్కరించిన చంద్రబాబు సలహాలను తీసుకోవడం లేదు. ప్రజల్లో ధైర్యం నింపడం జగన్ కి చేతకావడంలేదు. అన్ని వర్గాలకు చంద్రబాబు ధైర్యం చెబుతున్నారు'' అన్నారు. 

''జిల్లాల్లో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల ఆగడాలపై ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి. వైసీపీ ఎంపీ బాలశౌరి సంవత్సరం నుంచి కనిపించడం లేదు. హైదరాబాద్ లో బాలశౌరికి చెందిన భవనంలో మెడికార్ప్ అనే సంస్థ అద్దెకు ఉంది. ఆ బిల్డింగ్ లో ఐసీఎంఆర్ వారు కరోనా టెస్టులు చేయకుండా బాలశౌరి దౌర్జన్యం చేయిస్తున్నారు. సిబ్బందిని బలవంతంగా బయటకు నెట్టేస్తున్నారు. బాలశౌరి విధానం ఇక్కడే తెలుస్తోంది. ప్రజల పక్షాన ఉంటే ఇలా చేస్తారా ? దాడులు చేయించిన బాలశౌరిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలి''  అని సూచించార.

''సాయం చేసేందుకు ముందుకొచ్చిన తెలుగుదేశం వారిపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారు. మట్టి, ఇసుక, సారా వ్యాపారాలు చేస్తున్నారు. కిట్ల కొనుగోలులోనూ కక్కుర్తి పడ్డారు. ఇంతకంటే దౌర్బాగ్యం ఉందా?'' అని రవీంద్ర నిలదీశారు. 
 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios