Asianet News TeluguAsianet News Telugu

బందరు పోర్ట్ శంకుస్థాపన కాదది... పేర్ని నాని వీడ్కోలు, కొడుకు ప్రమోషన్ సభ : కొల్లు రవీంద్ర సెటైర్లు

ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బందరు పోర్టుకు శంకుస్థాపన చేయడంపై సెటైర్లు వేసారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.

Kollu Ravindra satires on CM Jagan and MLA Perni Nani AKP
Author
First Published May 23, 2023, 5:19 PM IST

మచిలీపట్నం : మాజీ మంత్రి పేర్ని నాని వీడ్కోలు, కొడుకు ప్రమోషన్ సభలా బందరు పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమం సాగిందంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేసారు. ప్రతిసారీ ఎన్నికల సమయంలోనే పేర్ని నానికి బందరు పోర్టు గుర్తుకు వస్తుందని... దీన్ని ఎలక్షన్ స్టంట్ గా వాడుకుంటున్నాడని అన్నారు. అసలు పోర్ట్ గురించి మాట్లాడే అర్హత కూడా సీఎం జగన్ కు,పేర్ని నానికి లేదన్నారు. 

మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి బందరు పోర్టును గోగులేరుకు తరలిస్తే ఎలాంటి అభ్యంతరం లేదని సంతకంపెట్టిన పేర్ని నాని ఇప్పుడు పోర్ట్ పేరెత్తడం విడ్డూరంగా వుందన్నారు. ఆ తర్వాత సీఎంగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి బందరు పోర్టుకు శంకుస్థాపన చేస్తే అదే కాంట్రాక్టర్ తో టిడిపి ప్రభుత్వం పనులు కొనసాగించిందని అన్నారు. కానీ వైసిపి అధికారంలోకి రాగానే పేర్ని నాని ఆ కాంట్రాక్టర్ ను కాదని పనులు ఆపించాడని అన్నారు. దీన్ని బట్టే బందరు పోర్ట్ నిర్మాణంపై ఎవరికీ చిత్తశుద్ధి వుందో అర్థమవుతుందని అన్నారు. 

తాజాగా జగన్ శంకుస్థాపన చేసిన పోర్ట్ వలన బందరుకు ఎటువంటి ప్రయోజనం లేదని కొల్లు రవీంద్ర అన్నారు. టిడిపి 24 బెర్తులకు 5 వేల కోట్లతో నిర్మించాలనుకుంటే ఇప్పుడు కేవలం 4  బెర్తులకే రూ.5,500 కోట్లు ఖర్చు అంటున్నారని అన్నారు. ఇది పోర్టుకు తక్కువ హార్బర్ కు ఎక్కువంటూ సెటైర్లు వేసారు. ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలివ్వడానికే డబ్బులు లేవంటోంది... అలాంటిది అప్పు చేసి పోర్ట్ కడతామంటున్నారన్నారు. రూపాయి ఖర్చులేకుండా పోర్ట్ నిర్మాణం, ఇండస్ట్రీస్, పోర్ట్ సిటీ, పోర్ట్ ఆపరేటింగ్ ఏర్పాటుకు చంద్రబాబు ఏర్పాట్లు చేస్తే దాన్ని కాదని అప్పుచేసి పోర్ట్ కడతామంటున్నారని... దీన్ని ఎవూ నమ్మే పరిస్థితి లేదన్నారు కొల్లు రవీంద్ర. 

Read More  తెలుగుదేశం పార్టీ నుంచి పోటీపై ఆనం క్లారిటీ.. ముందస్తు ఎన్నికలు రావొచ్చని కామెంట్..

గత టిడిపి ప్రభుత్వ హయాంలో హార్బర్ నిర్మాణానికి రూ. 250 కోట్లతో టెండర్లు పిలిచారని... అదే హార్బర్ నిర్మాణవ్యయాన్ని వైసీపీ ప్రభుత్వం రూ.550 కోట్లకు పెంచిందని కొల్లు రవీంద్ర అన్నారు. దీంట్లో రూ.200 కోట్లు కమీషన్ కొట్టేసారని ఆరోపించారు. ఈ హార్బర్ కాంట్రాక్టు కూడా వైసీపీ ఎమ్మెల్యే తమ్ముడికే ఇచ్చారని మాజీ మంత్రి తెలిపారు. 

 టిడిపి అధికారంలోకి రాగానే గతంలో చెప్పినట్లు మేజర్ పోర్ట్ ల నిర్మాణం చేస్తామన్నారు. బందురు పోర్టును 24 బెర్తులతో నిర్మించి మచిలీపట్నం ప్రజల చిరకాల వాంఛ నెరవేరుస్తామన్నారు. మచిలీపట్నం అభివృద్ది టిడిపితోనే సాధ్యమని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios