హైదరాబాద్‌: విశాఖ శారదా పీఠం అధిపతిగా కిరణ్ శాస్త్రి నియమితులు అయినట్లు ఆల్ ఇండియా బ్రహ్మన ఫెడరేషన్ స్పష్టం చేసింది. ప్రస్తుత పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి శిష్యుడు కిరణ్ శాస్త్రి పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిపింది. 

ఈ నెల 15,16,17 తేదీల్లో విజయవాడ కృష్ణా నదీతీరాన ఉత్తరాధికారి శిష్య తురీయాశ్రమ దీక్షా స్వీకార మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడు, వైసీపీ స్టేట్‌ అడిషనల్‌ సెక్రటరీ రఘురామయ్య చెరుకుచర్ల స్పష్టం చేశారు. 

ఉత్తరాధికారి శిష్యతురీయాశ్రమ దీక్షా స్వీకార మహోత్సవానికి సంబంధించి వాల్ పోస్టర్లను బుధవారం హైదరాబాద్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు కేవీ రమణచారి, అధికార ప్రతినిధి కె.వేణుగోపాల చారి, మాజీమంత్రి శ్రీధర్ బాబులు పాల్గొన్నారు. 

స్వరూపానందేంద్ర సరస్వతి పదవి ముగుస్తున్న కారణంగా ఆయన స్థానంలో తన శిష్యుడు కిరణ్‌ శాస్త్రిని విశాఖ పీఠాధిపతిగా  నియమిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్, ఏపీ సీఎం వైయస్ జగన్, తెలంగాణ కేసీఆర్ లతోపాటు దేశంలో పలువురు రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు హాజరుకానున్నట్లు రఘురామయ్య స్పష్టం చేశారు.